సోషల్ మీడియా మాద్యమంగా ( Social media ) మనం తరచూ విభిన్నమైన వీడియోలు, ఫోటోలు చూస్తుంటాం. ఇటువంటివి సహజంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా అత్యంత అరుదైన ఓ జంతువు వీడియోను ఇలాగే ఓ ఫారెస్ట్ అధికారి ( Forest Officer ) షేర్ చేశారు. షేర్ చేయడమే ఆలస్యం..వైరల్ అయిపోయింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ షేర్ చేసిన ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇది బ్లాక్ పాంథర్ లా కన్పిస్తుండవచ్చు కానీ కాదు. అంతరించిపోతున్న అరుదైన జంతువుల్లో ఒకటి ఇది. దీన్ని నీలగిరి పిల్లి ( Nilgiri cat ) అంటారు. దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమల్లో ( Western ghats ) నివసించే ఈ జంతువు చాలా అరుదుగానే కన్పిస్తుంటుంది. మార్టెన్ ( Marten ) జాతికి చెందిన ఈ జంతువు ప్రస్తుతం అంతరించే దశలో ఉండటం గమనార్హం. ఇది ఈ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ ( Forest officer sudha ramen ) కంటికి కన్పించడంతో వీడియో తీసి షేర్ చేశారు.
This not a black Panther which might excite you. This is Nilgiri marten, an arboreal endemic and endangered animal to smaller pockets of Western Ghats. This is the only Marten species available in South India. pic.twitter.com/iGNKi29tqD
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) August 11, 2020
ఈ నీలగిరి పిల్లి మెడభాగం పసుపు, నలుపు రంగులో మిళితమై ఉంటుంది. 2.1 కిలోల బరువు, 40-45 సెంటీమీటర్ల పొడవు తోకను కలిగి ఉంటుంది. జీవజాతుల ప్రపంచ పరిరక్షణ స్థితిని అధ్యయనం చేసే ఐయూసిఎస్ ( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ) ఈ జంతువును రెడ్ లిస్ట్ లో అంటే ప్రమాదకర స్థితిలో చేర్చింది. Also read: Sex Racket Busted: సెక్స్ రాకెట్ చెర నుంచి ఇద్దరు మహిళలకు విముక్తి