హైదరాబాద్‌లోని వనస్థలపురానికి చెందిన ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్, ఏటీఎం నుండి అయిదు రూ.2000 నోట్లను డ్రా చేయగా అన్ని చెల్లని నోట్లే వచ్చాయి. అందులో పలు నోట్లు బాగా చిరిగిపోయి ఉండగా.. మరికొన్ని నోట్లు సిరాతో తడిచిపోయి ఉన్నాయి. ఆ విషయం గురించి తాను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషనులో కూడా ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే డబ్బులు డ్రా చేసిన కస్టమర్.. అంత అధ్వాన స్థితిలో ఉన్న నోట్లను చూసి కంగుతిన్నాడు. అవీ ఎందుకు ఉపయోగపడని నోట్లని.. అందుకే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక సీసీ కెమెరాలకు ఆ నోట్లను ఓ సారి చూపించి.. ఆ తర్వాత పోలీస్ స్టేషనుకి వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. అయితే పోలీసులు ఈ విషయమై ఎలాంటి కేసునూ నమోదు చేయలేదట. తమ జనరల్ డైరీలో వివరాలు రాసుకొని.. ఎస్బీఐ బ్యాంకు అధికారులతో మాట్లాడతామని తెలిపారట.
అయితే కస్టమరు ట్విటర్‌లో పోస్టు చేసిన విషయానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు బదులిచ్చారు. "కరెన్సీ నోట్లను ఏటీఎంలోకి పంపించేటప్పుడు పూర్తిస్థాయిలో క్వాలిటీ చెకింగ్ జరుగుతుందని.. అలాంటప్పుడు చెల్లని నోట్లు వచ్చే అవకాశమే లేదని.. అయినా కస్టమర్ చెల్లని నోట్లను డ్రా చేశారు కాబట్టి.. వాటిని స్థానిక బ్యాంకు బ్రాంచిల్లో మార్చుకోవచ్చని" స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ట్విటర్ ఖాతా ద్వారా బదులిచ్చింది.
All 5 notes(Rs.10000)(2000 denomistions) withdrawn from @TheOfficialSBI ATM at vanastalipuram are torn and unusable. Is @TheOfficialSBI trying to cheat the public with such kind of notes. How do you even dare to put in the ATMs with your sticker @TheOfficialSBI .(1/2) pic.twitter.com/rRDuPwIiyt
— Srikar Aditya (@Srikar_Aditya) May 11, 2018