హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్

       

Last Updated : Oct 15, 2017, 08:52 PM IST
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు  షాక్

హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతున్న సందర్భంలో అక్కడి కాంగ్రెస్ అధిష్టానానికి ఊహించని షాక్ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్‌ శర్మ కాంగ్రెస్‌ను వీడి, భారతీయ జనతా పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటన చేశారు.  మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రామ్‌ కుమారుడైన అనిల్‌ శర్మ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుండి పోటీకి నిలవనున్నారు. ఇదే విషయాన్ని ఆయన ఆదివారం మీడియాకి తెలిపారు.  కాంగ్రెసు తీరు తమను వేదనకు గురిచేసిందని, అందుకే ఆ పార్టీని వీడి, బీజేపీ ద్వారా పోటీ చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 2007, 2012 ఎన్నికల్లో మండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శర్మ.. ఈ సారి మాత్రం బీజేపీ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  ఈ సంవత్సరం నవంబరు 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

Trending News