Beating Retreat: ఢిల్లీ బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో లేజర్ వెలుగులతో మెగా డ్రోన్ షో..

Beating Retreat Ceremony: ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో జరిగిన బీటింగ్ రిట్రీట్ పరేడ్ వేడుకల్లో గగన తలంలో మెగా డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 10:32 PM IST
  • ఢిల్లీ విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్ వేడుకలు
  • ప్రత్యేక ఆకర్షణగా మెగా డ్రోన్ షో
  • గగన తలంలో వివిధ ఆకృతుల ప్రదర్శన
 Beating Retreat: ఢిల్లీ బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో లేజర్ వెలుగులతో మెగా డ్రోన్ షో..

Beating Retreat Ceremony:రిపబ్లిక్ డే వేడుకల ముగింపులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్ పరేడ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆకాశంలో మెగా డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు వెయ్యి మేడిన్ ఇండియా డ్రోన్లు  లేజర్ వెలుగులతో గగన తలంలో వివిధ ఆకృతులను ప్రదర్శిస్తూ కనువిందు చేశాయి. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రను గుర్తుచేసేలా జరిగిన ఈ మెగా డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది.

 'బొట్లాబ్ డైనమిక్స్' అనే స్టార్టప్ సంస్థ ఆధ్వర్యంలో 10 నిమిషాల పాటు ఈ ప్రదర్శన జరిగింది. ఐఐటీ ఢిల్లీ దీనికి సహాయ సహకారాలు అందించింది. డ్రోన్ షోపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. 'బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో తొలిసారి వెయ్యి డ్రోన్లతో గగన తలంలో జరిగిన ఈ ప్రదర్శన గర్వించదగ్గ విషయం. యూకె, రష్యా, చైనా తర్వాత ఈ ఫీట్ సాధించిన దేశం భారత్ మాత్రమే.' అని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ఈ ప్రదర్శనకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఫండింగ్ చేయడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు బొట్లాబ్ డైనమిక్స్ సంస్థ ఈ ప్రదర్శన కోసం ఆర్నెళ్ల పాటు కసరత్తులు చేశారన్నారు. బీటింగ్ రిట్రీట్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ తదితరులు హాజరయ్యారు.

Also Read: Kuldeep Yadav: కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోవడం కుల్దీప్ యాదవ్‌కు కలిసొచ్చిందా..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News