/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

పుల్వామా దాడికి  భారత్ ప్రతీకారం చర్యలో భాగంగా ఈ రోజు యుద్ధవిమానాలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రమూలక శిబిరాలపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున జరిగిన ఈ దాడి 3:30 గంటలకు మొదలు పెట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్‌ను కేవలం 20 నిమిషాల్లో ముగించింది. పాక్ తేరుకునే సరికి బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా నిమిషాల వ్యవధిలో 300 మంది ఉగ్రమూకల ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయాయి. ఈ దాడితో తమ మంచితనాన్ని చేతగాని తనంగా చూడవద్దని భారత్ మరోమారు గట్టి హెచ్చరికలు పంపింది..

మిరాజ్-2000 గురించే చర్చ..

ఇంత తక్కువ వ్యవధిలో భారీ మొత్తంలో ఇంత మంది ప్రత్యర్ధులపై విరుచకుపడంలో మిరాజ్ -2000 యుద్ధ విమానాలదే కీలక పాత్ర. భారత వైమానిక దళం అమ్ములపొదిలో ఉన్న ఈ యుద్ధ విమానాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీని గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారా ? అయితే దీని ప్రత్యేక ఇంటో ఒక్కసారి తెలుసుకోండి మరి...

చీమ్మ చీకట్లో సైతం గురితప్పదు...

మిరాజ్ -2000 యుద్ధ యుద్ధ విమానాన్ని డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్‌తో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది గంటకు 2,795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిగలదు. దీనిలో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్‌తో శత్రువుల్ని ఆటోమేటిక్‌గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో దిట్ట. ఒక్క నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను చేధించి ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత.  మైకా టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్‌సెప్ట్, యుద్ధ క్షిపణులు, మ్యాజిక్ 2 యుద్ధ క్షిపణులను లాంటి భారీ క్షిపణలను తడబడకుండా మోసుకెళ్లగలదు. 999 కార్గిల్ యుద్ధంలోనూ మిరాజ్ యుద్ధ విమానం కీలకపాత్ర పోషించిందట.. 

Section: 
English Title: 
Surgical strike 2 :Specifications of Mirage 2000, fighter jet
News Source: 
Home Title: 

Surgical strike 2 : మెరుపుదాడిలో సత్తా చాటిన మిరాజ్-2000 ప్రత్యేకతలు ఇవే

Surgical strike 2 : మెరుపుదాడిలో సత్తా చాటిన మిరాజ్-2000 ప్రత్యేకతలు ఇవే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మెరుపుదాడిలో సత్తా చాటిన మిరాజ్-2000 ప్రత్యేకతలు ఇవే
Publish Later: 
No
Publish At: 
Tuesday, February 26, 2019 - 20:41