Gautam Gambhir: 'గంభీర్​కు బెదిరింపు మెయిల్స్ వచ్చింది పాకిస్థాన్​ నుంచే'..!

Threat Emails to Gautam Gambhir: ఎంపీ గౌతమ్​ గంభీర్​కు వచ్చిన బెదిరింపు ఈ-మెయిళ్లపై పురోగతి సాధించారు ఢిల్లీ పోలీసులు. ఈ-మెయిల్ మూలాలు పాకిస్థాన్​లో ఉన్నట్లు గుర్తించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 03:37 PM IST
  • గంభీర్​కు ఈ-మెయిల్ బెదిరింపుల విషయంలో పురోగతి
  • పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు
  • పంపింది ఓ కాలేజీ విద్యార్థి అని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
Gautam Gambhir: 'గంభీర్​కు బెదిరింపు మెయిల్స్ వచ్చింది పాకిస్థాన్​ నుంచే'..!

Threatening emails to Gautam Gambhir traced to Pakistan: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గంభీర్‌ను చంపుతామంటూ వచ్చిన ఈ-మెయిల్స్​పై ఢిల్లీ పోలీసులు విచారణ చెపట్టి.. పురోగతి సాధించారు. గంభీర్​కు మెయిల్స్​ పంపింది.. పాకిస్థాన్ నుంచేనని గుర్తించారు పోలీసులు.

విచారణలో భాగంగా గూగుల్ సహాయం తీసుకున్న పోలీసులు.. పాకిస్థాన్​లోని ఓ కాలేజీ విద్యార్థి ఈ-మెయిల్స్ (Pak student threat mails to Gambhir) పంపినట్లు తెలుసుకున్నారు.

మెయిల్స్ పంపిన వ్యక్తి వయస్సు 25-26 మధ్య ఉంటుందని.. అతడు కరాచీలోని సింధ్​ యూనివర్సిటీలో చదువుతున్నట్లు గుర్తించారు.  అయితే ఈ విషయంపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Also read: Kangana Ranaut : సిక్కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిందంటూ కంగ‌నాకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి స‌మ‌న్లు

Also read: Road Accident: సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...కుటుంబం దుర్మరణం

మెయిల్స్​లో ఏముందంటే..

గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి.. ‘ఐఎస్‌ఐఎస్‌, కశ్మీర్‌' ఐడీతో గంభీర్​కు ఇటీవల ఓ ఈ-మెయిల్ వచ్చింది. అందులో గంభీర్ ఇంటికి సంబంధించి వివరాలు (threat mails to Gambhir from ISIS) ఉన్నాయి. ప్రాణహాని తలపెడతామని ఆ ఈ-మెయిల్ పంపిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఆ తర్వాత అదే మెయిల్ నుంచి మరుసటి రోజు మరో ఈ-మెయిల్ వచ్చింది. అందులో రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉంటేనే ప్రాణాలు దక్కుతాయని మరోసారి ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. దీనితో గంభీర్​ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.

గౌతమ్ గంభీర్ ఫిర్యాదుపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ శ్వేతా చౌహాన్ ఈ విషయంపై విచారణ చేపడుతున్నట్లు బుధవారం తెలిపారు. తాజాగా దీనిపై పురోగతి సాధించారు.

Also read: Subramanian Swamy: 'ఆర్థికం నుంచి అంతర్గత భద్రత వరకు అన్నింటా ప్రభుత్వం ఫెయిల్​'

Also read: Meghalaya Congress : మేఘాలయలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..టీఎంసీలోకి 12 మంది ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News