Three Died In Bihar: హోలీ పండుగ వేళ బీహార్‌లో విషాదం చోటు చేసుకుంది. గయా జిల్లా బరాచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని గులార్‌వేడ్ గ్రామంలో ఫిరంగి గుండు పేలి ముగ్గురు మృతిచెందారు. సైన్యం జరిపిన విన్యాసాల సందర్భంగా కాల్చిన ఫిరంగి గుండు తగిలి ముగ్గురు గ్రామస్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గులార్ బెడ్ గ్రామంలో హెలీ వేడుకలు జరుగుతుండగా.. అదే సమయంలో సైనిక విన్యాసాల రిహాల్స్ నిర్వహించారు. ఈ క్రమంలో ఫిరంగిలోని ఓ మందు గుండు గ్రామంలోని గోవింద్ మాంఝీ అనే వ్యక్తి ఇంటిపై పడింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
గయా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భారతి మాట్లాడుతూ.. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) నేతృత్వంలోని పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. ఫైరింగ్ రేంజ్ వెలుపల ఫిరంగి బంతి ఎలా పడిపోయిందనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో గులార్‌వేడ్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారని వెల్లడించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం గయా నగరంలోని అనుగ్రహ్ నారాయణ్ మగద్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువు మంజు దేవి మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులు ఇంటి బయట కూర్చున్నప్పుడు.. అకస్మాత్తుగా ఫిరంగి గుండు పడిపోయిందని తెలిపారు. గుండు దాటిని తమ బంధువులు చనిపోయారని చెప్పారు.
ఈ ఘటనపై గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ ఆశీష్ భారతీ తెలిపారు. ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. హోలీ పండుగ వేళ ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: Building Collapses Video: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. వీడియో చూశారా..!
Also Read: Suma Adda Show: సుమక్కా.. అవి లారీ కింద నిమ్మకాయలు.. ఎంత పనిచేశావ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook