Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Gold Rate: బంగారం ధరల్లో మరోసారి మార్పు వచ్చింది. బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరగగా..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2021, 08:08 AM IST
Gold Rate: స్థిరంగా బంగారం ధర, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Gold Rate: బంగారం ధరల్లో మరోసారి మార్పు వచ్చింది. బంగారం ధర కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరగగా..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోడానికి చాలా కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం వంటివి బంగారం ధరలపై(Gold Rate)ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ ఎప్పటికప్పుడు బంగారం ధర మారుతుంటుంది. దేశవ్యాప్తంగా ఇవాళ వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 850 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52 వేల 200 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 640 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 640 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 910 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 100 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 950 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 650 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 700 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుగా ఉంది. 

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate)10 గ్రాముల ధర 45 వేల 7 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల  వందలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 85 రూపాయలు పలుకుతోంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది.

Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లపై బేర్​ పంజా- 56 వేల మార్క్​ కోల్పోయిన సెన్సెక్స్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News