Top terrorist commander of Jaish-e-Mohammad (JeM) Sham Sofi was killed in an encounter: కశ్మీర్ లోయలో దాడులకు పాల్పడుతున్న టెర్రరిస్ట్‌లను (terrorists) మన భద్రతాదళాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా జమ్ము-కశ్మీర్‌లోని (Jammu and Kashmir) పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది శామ్ సోఫీ (Sham Sofi) హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐజీపీ విజయ్‌కుమార్ ( IGP Vijay Kumar) వెల్లడించారు. పుల్వామాలోని అవంతిపురలో ఉన్న తుల్రాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం రాగానే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత ఉగ్రవాదులు భద్రతా దళాలపై ఎదురుకాల్పులు చేపట్టింది. ఇందులో ఓ భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : తమిళ చిత్రసీమలో విషాదం...వెటరన్ నటుడు శ్రీకాంత్ మృతి
ఇక కశ్మీర్‌లో (Kashmir) వరుస ఉగ్ర దాడుల నేపథ్యంలో మన భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు దాదాపు 700 మంది టెర్రిరిస్ట్ ((terrorist) సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతం అవుతున్నారు. నిన్న షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతకముందు బందిపొరా, అనంత్‌నాగ్‌లో చేపట్టిన ఎన్‌కౌంటర్లలోనూ (encounter) ఇద్దరు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు.
Also Read : BiggBoss Telugu5: నేను కోరుకున్న ప్రేమ శ్రీరామ్ దగ్గర ఉంది - హమీదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి