Telangana Floods: వారం రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. గోదావరి మహోగ్రంగా ఉప్పొంగడంతో గోదావరి తీరం అల్లకల్లోలమైంది. వందలాది గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. వేలాది మంది ఇళ్లు వదిలి పునరావాసకేంద్రాలకు వెళ్లిపోయారు. వరద మేనేజ్ మెంట్ లో తెలంగాణ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని.. జాతీయ రాజకీయాలంటూ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ వరదల రచ్చ పార్లమెంట్ ను తాకింది.
లోక్ సభలో తెలంగాణ వరదలపై మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరద వచ్చిందని, జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని... దీనిపై వెంటనే సభలో చర్చించాలని తీర్మానంలో కోరారు రేవంత్ రెడ్డి. వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయన్నారు.11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయని తన తీర్మానంలో వివరించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వరదలను పరిస్థితి జాతీయ విపత్తుగా ప్రకటించి 2 వేల కోట్ల రూపాయల తక్షణ సహాయ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మౌలిక సదుపాయాల నష్టాలను సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. విధ్వంసకర వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
Read also: TS EAMCET 2022: నేడు తెలంగాణ ఎంసెట్.. వర్షాలతో ప్రత్యేక ఏర్పాట్లు... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Read also: Cloud Busrt: క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ? ఆకస్మిక వరదలు స్పష్టించడం సాధ్యమా? గోదావరిపై కుట్ర జరిగిందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Telangana Floods: లోక్ సభను తాకిన తెలంగాణ వరదల రచ్చ.. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి
లోక్ సభలో ఎంపీ రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం
తెలంగాణ వరదలపై చర్చకు డిమాండ్
రూ. 2 వేల కోట్ల సాయం కోరిన రేవంత్ రెడ్డి