Aadhaar Card: భారతదేశ పౌరులకు యూఐడీఏఐ జారీ చేసే కార్డు ఆధార్. గుర్తింపు కార్డు లాంటిది. ప్రభుత్వ పథకాల లబ్ది పొందేందుకు ఇది అత్యవసరం. ఆఖరికి సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కావల్సిందే. 2010లో ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు ఎక్కడైనా సరే ఐడీ కార్డులా ఉపయోగించుకోవచ్చు. అందుకే అడిగిన చోటల్లా మనం తెలిసో తెలియకో ఆధార్ నెంబర్ ఇచ్చేస్తుంటాం.
ఆధార్ కార్డు నెంబర్ ఇటీవలి కాలంలో దుర్వినియోగమవుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఎప్పుుడెప్పుడు ఎవరెవరికిచ్చామో తెలియకపోవడం వల్లనే ఈ సమస్య. అందుకే ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామందికి ఆధార్ దుర్వినియోగం విషయంలో పెద్దగా అవగాహన ఉండదు. అంత అవసరం అన్పించదు. కానీ ఆధార్ నెంబర్‌ను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఇచ్చామో తెలుసుకోవడం అవసరం. సాధారణంగా ఇదెవరికీ గుర్తుండకపోవచ్చు. కానీ ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకోవడం సులభమే. ఎవరైనా మీకు తెలియకుండా మీ ఆధార్ నెంబర్ ఉపయోగిస్తుంటే వెంటనే కనిపెట్టి సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.
ఆధార్ హిస్టరీ ఎలా చెక్ చేయడం
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై ఎడమచేతివైపు మై ఆధార్ ఆప్షన్‌లో కన్పించే ఆధార్ సర్వీసెస్ క్లిక్ చేయాలి. అలా కిందకు స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఆధార్ ఐడెంటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్ కన్పిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ సహాయంతో లాగిన్ కావాలి.
తరువాత స్క్రీన్‌లో కన్పించే అథెంటిఫికేషన్ హిస్టరీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ తీసుకుని తేదీ సెలెక్ట్ చేయాలి. ఫెచ్ అథెంటిఫికేషన్ హిస్టరీ క్లిక్ చేయాలి. దాంతో గత ఆరు నెలలుగా మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారో తెలిసిపోతుంది.
Also read: Petrol Price: వావ్ ఇట్స్ వేరీ చీప్.. అక్కడ పెట్రోల్ ధరలు అత్యంత చవక.. లీటర్ ధర ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook