దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు హల్‌చల్ చేశారు. ఢిల్లీలో అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి వద్ద నిలువుదోపిడీకి పాల్పడ్డారు. ఢిల్లీలోని తిలక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. తిలక్ నగర్ లో ఓ వ్యక్తి వెళ్లేందుకు అప్పుడే కారు ఎక్కుతున్నాడు. ఇంతలో వచ్చిన నలుగురు దొంగలు.. అతన్ని కారు డోర్ తీసి మరీ బెదిరించారు. పిస్టళ్లు గురిపెట్టారు. తన వద్ద ఉన్న సొమ్ము అంతా ఇచ్చేయాలని భయపెట్టారు. దీంతో అతను భయపడి పర్స్ లో ఉన్న డబ్బులు, ఒంటిపై ఉన్న బంగారం ఇచ్చేశాడు. అవి తీసుకున్నప్పటికీ ఆగని దుండగులు.. కారు డిక్కీ తెరవమని బెదిరించారు. కారు డిక్కీలో చూసి ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన పాదచారులను సైతం వారు బెదిరించారు.
#WATCH Four unidentified men caught on camera robbing a man in Delhi's Tilak Nagar yesterday pic.twitter.com/KeSHMdpd8I
— ANI (@ANI) January 7, 2020
సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం అంతా .. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితుడి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు .. సీసీ ఫుటేజీ ఆధారంగా దోపిడీ దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..