న్యూఢిల్లీ: రానున్న 2019 లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ డిసెంబర్ 10న ఎన్డీఏకి గుడ్ బై చెప్పిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ ఇవాళ బీహార్‌లోని మహాఘట్ బంధన్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో సీట్ల పంపకాల విషయంలో ఓ అవగాహన కుదుర్చుకున్న అనంతరమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యూపీఏలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉపేంద్ర కుశ్వాహ.. ఎవరైతై సామాన్యుని పక్షాన నిలుస్తారో.. వారితోనే కలిసి పనిచేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి చేతుల్లో తాను అవమానానికి గురయ్యానన్న కుశ్వాహా.. వాస్తవానికి బీహార్‌లో వున్న సామాన్య ప్రజానికం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదని అన్నారు.
Upendra Kushwaha, RLSP Chief on joining Bihar #Mahagathbandhan: We had said that we have many options and UPA was one of them. The wholeheartedness shown by Rahul Gandhi and Lalu Yadav is one of the reasons I joined but the biggest reason I'm here is the people of Bihar. pic.twitter.com/tcfGPN4to2
— ANI (@ANI) December 20, 2018
ఇదిలావుంటే, మరోవైపు ఉపేంద్ర కుశ్వాహా యూపీఏలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ సైతం హర్షం వ్యక్తంచేసింది. ఉపేంద్ర కుశ్వాహతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. కుశ్వాహ మహాకూటమిలో చేరడం శుభపరిమామం అని అన్నారు.