UPSC: సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ.. 1105 పోస్టులు.. అప్లై చేసుకోండి ఇలా..!

UPSC exam 2023: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1105 పోస్టులను భర్తీ చేయనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2023, 05:02 PM IST
UPSC: సివిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యూపీఎస్సీ.. 1105 పోస్టులు.. అప్లై చేసుకోండి ఇలా..!

UPSC Civil Services Notification 2023: సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 1,105 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. గతంలో అంటే 2016లో 1209 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. 

డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం upsc.gov.in, upsconline.nic.in వెబ్ సైట్లుకు వెళ్లండి. దీని పరీక్ష ఫీజు రూ.100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు ఫీజు లేదు. అభ్యర్థులు వయసు ఆగస్టు 1 నాటికి 21 ఏళ్లు నిండి 32 ఏళ్ల మధ్య ఉండాలని యూపీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష మే 28, 2023న జరగనుంది. 

అప్లై చేసుకోవడం ఎలా?
** ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.inలోకి వెళ్లండి.
** Whats New అనే సెక్షన్ లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
** న్యూ పేజీ ఓపెన్ అవుతుంది
** లాగిన్ వివరాలు లేదా రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. 
** తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపి.. ఫీజు చెల్లించండి. అనంతరం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. 
** హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోండి.  

Also Read: Group-4 Exam Date: గ్రూప్‌-4 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది... ఎప్పుడంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News