UPSC Prilimanary Exam 2021: నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష...TSRTC ఉచిత రవాణా సౌకర్యం

UPSC Prelims Exam: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC-2021) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. TSRTC అభ్యర్థులకు ఉచిత రవాణా సౌకర్యం అందించనుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 11:30 AM IST
UPSC Prilimanary Exam 2021: నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష...TSRTC ఉచిత రవాణా సౌకర్యం

UPSC Prelims Exam 2021:  సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్(UPSC Mains Exam) పరీక్ష జరగనుంది.

తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, ఏపీలో విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్షకు 10 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశాన్ని(upsc exams 2021) నిలిపివేయనున్నారు. అన్ని కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు(Covid Rules) తప్పకుండా పాటించాలని అభ్యర్థులుకు అధికారులు సూచించారు.

Also Read: Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు

తెలంగాణ...
తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు(Candidates) పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌లో 46,953 మందికి 101 పరీక్ష కేంద్రాలు, వరంగల్‌లో 6,062 మందికి 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరే కాకుండా దిల్లీలో శిక్షణ తీసుకుంటున్న మరో 3 వేల నుంచి 5 వేల మంది తెలంగాణ(Telangana)కు చెందిన అభ్యర్థులు అక్కడ పరీక్షలు రాస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. 

TSRTC బంపర్ ఆఫర్
యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021(UPSC Prelims Exam 2021)కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్‌ఆర్‌టీసీ(TSRTC) నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్‌లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవ(Free transportation service)ను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్‌ సివిల్ సర్వీస్ పరీక్ష -2021కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌ఆర్‌టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News