559 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్

మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (Combined Medical Services Examination 2020) నోటిఫికేషన్‌ను UPSC విడుదల చేసింది.

Last Updated : Aug 3, 2020, 06:19 PM IST
559 ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (Combined Medical Services Examination 2020) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ (MBBS)తోపాటు ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేసిన అభ్యర్థులను అర్హులుగా పరిగణిస్తారు.  మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
అప్లై చేయడానికి క్లిక్ చేయండి (Online Application)

మొత్తం పోస్టులు: 559

  • సెంట్రల్ హెల్త్ సర్వీస్ విభాగంలో జూనియ‌ర్ స్కేల్(సెంట్రల్ హెల్త్ స‌ర్వీసెస్‌): 182 ఉద్యోగాలు
  • రైల్వే డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డివిజ‌న‌ల్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 300 ఉద్యోగాలు
  • ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ (హెల్త్ సర్వీస్)లో అసిస్టెంట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌: 66 ఉద్యోగాలు
  • న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 04 ఉద్యోగాలు
  • ఈస్ట్/నార్త్/సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో జూనియ‌ర్ డ్యూటీ మెడిక‌ల్ గ్రేడ్‌(2): 07 ఉద్యోగాలు  COVID19 Medicine: రూ.59కే కరోనా ట్యాబ్లెట్..

వయోపరిమితి (Age Limit): 01.08.2020 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
అప్లై చేయడానికి క్లిక్ చేయండి (Online Application)

జులై 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.08.2020. రూ.200 చెల్లించి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు. పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, బెంగళూరు, చెన్నైతో సహా దేశవ్యాప్తంగా 41 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి (Click here for CMSE Notification)

వెబ్‌సైట్

Trending News