వాట్సాప్‌లో ఫేక్‌ న్యూస్ వ్యాప్తి నివారణకు సరికొత్త యాప్

ఫేక్ న్యూస్ ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో వాట్సాప్  సంస్థ దిగివచ్చింది.

Updated: Jul 9, 2018, 08:03 PM IST
వాట్సాప్‌లో  ఫేక్‌ న్యూస్ వ్యాప్తి నివారణకు సరికొత్త యాప్

కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో వాట్సాప్  సంస్థ దిగివచ్చింది. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి కాకుండా తగు చర్యలకు సిద్ధమైంది. ఈ క్రమంలో వాట్సాప్ లో పలు మార్పులతో చేసింది. వాట్సప్‌ 2.18.204 బీటా వెర్షన్‌లో ‘అనుమానిత లింక్‌’ అనే ఈ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలోనే ఉంది. టెస్టింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ యాప్ యుజర్లకు అందుబాటులోకి రానుంది. కాగా తాజాగా ప్రవేశపెట్టిన ఫీచర్‌తో పుకార్లను అరికట్టవచ్చని వాట్సప్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.     

సరికొత్త యాప్ పనితీరు..
వాట్సాప్ ప్రవేశ పెట్టిన సరికొత్త ఫీచర్ పనితీరు గురించి ఒక్కసారి తెలుసుకుందాం.  గ్రూప్‌ల్లో ఫార్వర్డ్‌ అయ్యే ఫేక్‌ న్యూస్‌ను ఈ యాప్‌ కనిపెట్టి యూజర్లను హెచ్చరిస్తుంది. యూజర్లు ఆ మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేసే సమయంలో అది ఏ వెబ్‌సైట్‌ లింక్‌ అనే విషయాన్ని ఆ సైట్‌ ప్రామాణికతను పరీక్షిస్తుంది. అలాగే, మన గ్రూప్‌లో షేర్‌ అయిన మెసేజ్‌ని టైప్‌ చేసి పంపారా? లేక తమకు వచ్చిన దాన్ని ఫార్వర్డ్‌ చేసి పంపారా? అనే విషయాన్ని కూడా ఇకపై గుర్తించవచ్చు. దినికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ చూడవచ్చు.

ప్రభుత్వ వార్నింగ్ తో దిగి వచ్చిన వాట్సాప్

సామాజిక మాధ్యమం వాట్సప్‌లో వస్తోన్న ఫేక్‌ న్యూస్‌, వీడియోలలతో అనేక సమస్యలు తలెత్తుతోన్న విషయం తెలిసిందే.  ఫేక్‌ న్యూస్‌ కారణంగా పలు ప్రాంతాల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. దీంతో  కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వాట్సప్‌తో పాటు సోషల్ మీడియా సైట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్  సంస్థ ఈ మేరకు చర్యలు తీసుకుంది.