Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? ఈ ట్రిక్ మీ కోసమే..!

Dark circles under eyes:  కళ్ళ కింద వచ్చే నల్లటి వలయాలను దూరం చేసుకోవడానికి.. కొన్ని రకాల హోం మేడ్ చిట్కాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నల్లటి వలయాలు దూరం చేయడంలో టమోటా, కొబ్బరిపాలు, ఆల్మండ్ ఆయిల్ సమర్థవంతంగా పనిచేస్తాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 25, 2024, 07:54 PM IST
Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? ఈ ట్రిక్ మీ కోసమే..!

Under eye black solution: అమ్మాయిలు ఎంత అందంగా కనిపించాలి అనుకున్నా సరే... అధిక ఒత్తిడి, స్క్రీన్ టైం, కంటి నిండా నిద్ర లేకపోవడం, పోషకాల లోపం తదితర కారణాల వల్ల కళ్ళ కింద వలయాలు ఏర్పడతాయి.. ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా అప్పటికప్పుడు పనిచేస్తుంది. కానీ ఆ నల్లటి వలయాల వల్ల ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు.. మరింత నిర్జీవంగా మారిపోతుంది.. అయితే ఇలాంటి నల్లటి వలయాలను పార్లర్కు వెళ్లి తగ్గించడం కంటే కొన్ని రకాల హోమ్ మేడ్ చిట్కాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.. ముఖాన్ని అసహ్యంగా మార్చే ఈ డార్క్ సర్కిల్స్ ను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 

డార్క్ సర్కిల్స్ ను తగ్గించే చిట్కా..

టమాటో ప్యాక్..

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్ , ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్,  ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అన్నింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచాలి .. ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఉన్నచోట దూది సహాయంతో అప్లై చేసి 20 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం లభించడమే కాదు కళ్ళు కూడా తాజాగా ఉంటాయి. 

ఆల్మండ్ ప్యాక్..

ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో ఒక టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ రెండింటిని వేసి బాగా మిక్స్ చేయాలి.. రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్ ను కళ్ల చుట్టూ అప్లై చేసి.. పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇక్కడ నైట్ అంతా అలాగే ఉంచి ఉదయాన్నే ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.. డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంటుంది..

కొబ్బరి పాల ప్యాక్..

కొబ్బరి పాలతో కూడా కంటి కింద వలయాలను దూరం చేసుకోవచ్చు.. ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు,  ఒక టేబుల్ స్పూన్ కీరదోస జ్యూస్,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి.. రెండు కాటన్ బాల్స్ తీసుకొని ఈ మిశ్రమంలో అద్ది కంటి కింద పెట్టుకోవాలి ఇలా 20 నిమిషాల పాటు ఉంచితే కళ్ళు శుభ్రంగా వుండడమే కాదు నల్లటి వలయాలు మాయం అవుతాయి.

Also Read: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News