Bad Cholesterol Control In 7 Days: జీడిపప్పు తినేందుకు అందరూ ఇష్టపడతారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే బాడీకి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షించేందుకు సహాయపడతాయి. అంతే కాకుండా జీడిపప్పులో విటమిన్ ఇ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు సహాయపడుతుంది. అయితే వీటిని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
జీడిపప్పు వల్ల కలిగే ప్రయోజనాలు:
జీడిపప్పు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో జియాక్సంథిన్, లుటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును పెంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ప్రతి రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. వీటిల్లో ప్రోటీన్ల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. జీడిపప్పు తింటే జ్ఞాపకశక్తి పెరిగి మెదడు కూడా చురుకుగా తయారవుతుంది.
చలికాలంలో జీడిపప్పు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?:
జీడిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అంతే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది. చలికాలంలో జీడిపప్పును ఆహారంలో తీసుకుంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు సులభంగా తగ్గుతాయి. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీడిపప్పు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
జీడిపప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొందరు వీటిని తీసుకోవడం మానుకుంటున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని ఆహారంగా తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Jr NTR New Look : ఎన్టీఆర్ న్యూ లుక్.. బండ్లన్న ట్వీట్.. నెటిజన్ల ట్రోలింగ్
Also Read : Yashoda Movie Copied : యశోదపై ట్రోలింగ్.. దొరికిపోయిన దర్శకులు.. సమంతకు ఎంత కష్టమొచ్చే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook