Instant Pulihora Mix Recipe: ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ తయారీ విధానం సులభం..ఇలా చేసుకోండి!

Best Instant Pulihora Mix Recipe: ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ తయారు చేయడం చాలా కష్టమైనప్పటికీ..మేము అందించే కొన్ని సులభమైన పద్ధతి ద్వారా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ను ఇలా సులభంగా తయారు చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 05:07 PM IST
 Instant Pulihora Mix Recipe: ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ తయారీ విధానం సులభం..ఇలా చేసుకోండి!

Best Instant Pulihora Mix Recipe In Telugu: బిజీ లైఫ్‌లో కారణంగా చాలా మందికి వంట చేయడానికి టైం దొరకడం లేదు. దీని కారణంగా చాలా మంది బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. మరికొంతమందైతే మార్కెట్‌లో లభించే ఇన్స్టెంట్‌ పొడులు, పులిహోరాలను వాడుతున్నారు. ఇక నుంచి ఇలా చేయ్యన్నకర్లేదు. ఇంట్లోనే సులభంగా ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ను తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిని వంటలు రానీ వారు కూడా సులభంగా తయారు చేయవచ్చు. అయితే ఈ ఇన్స్టెంట్ పులిహోర మిక్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
చింతపండు పులుసు (Tamarind): 200 గ్రాములు
వేరుశనగ (Peanuts): 1/2 కప్పు
శనగపప్పు (Bengal Gram): 1/4 కప్పు
ఉల్లిపాయలు (Onions): 2, ముక్కలుగా తరిగినవి
ఎండు మిరపకాయలు (Dry Chilies): 4-5
జీలకర్ర (Cumin Seeds): 1 స్పూన్
ఆవాలు (Mustard Seeds): 1/2 స్పూన్
కరివేపాకు (Curry Leaves): కొన్ని
పసుపు పొడి (Turmeric Powder): 1/2 స్పూన్
ఉప్పు (Salt): రుచికి సరిపడా
నూనె (Oil): 2 టేబుల్‌స్పూన్లు
నల్ల నువ్వులు (Black Sesame Seeds): 1 స్పూన్
జాజికాయ పొడి (Nutmeg Powder): ఒక చిటికెడు

తయారుచేయు విధానం:
ముందుగా చింతపండు పులుసును గోరువెచ్చని నీటిలో నానబెట్టాల్సి ఉంటుంది. 
ఇలా నానబెట్టిన పులుసును ఒక గిన్నెలో పిండండి. 
ఆ తర్వాత ఓ బౌల్‌ పెట్టుకుని వేరుశనగ, శనగపప్పు బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
పెద్ద నాన్-స్టిక్ పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. జీలకర్ర, ఆవాల గింజలు వేసి చిటపటలాడనివ్వండి.
ఆ తర్వాత ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, ఎండు మిరపకాయలు వేసి వేయించండి.
ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత, కరివేపాకు, పసుపు పొడి వేసి కలపండి.
చింతపండు పులుసు, రుచికి సరిపడా ఉప్పు,  నల్ల నువ్వులు, జాజికాయ పొడి వేసుకుని బాగా కలపాల్సి ఉంటుంది. 
ఇందులో వేయించి చల్లార్చిన వేరుశనగ, శనగపప్పును మిక్స్‌ చేసి ఉడికించాల్సి ఉంటుంది. 
ఈ మిశ్రమాన్ని పొడిగా అయ్యేంత వరకు ఉడికించి మిక్సర్ గ్రైండర్‌లో పొడిలా పట్టాల్సి ఉంటుంది.
పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుకుని కావాల్సినప్పుడల్లా వినియోగించవచ్చు.

Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

పులిహోర తయారి విధానం:
అన్నాన్ని ఉడికించి, బాగా చల్లార్చుకోవాల్సి ఉంటుంది.
రెండు టేబుల్‌స్పూన్ల పులిహోర పొడిని అన్నంలో కలపాల్సి ఉంటుంది. 
ఇందులోనే కొత్తిమీర తురుము, కొద్దిగా నూనె వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది. 
అంతే సులభంగా రుచికరమైన ఇన్‌స్టెంట్ పులిహోర సిద్ధమైనట్లే!

Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News