Best Skin Care Tips: చలికాలంలో పొడి గాలి వల్ల ముఖం పొడిబారుతుంది. దీంతో చర్మంపై అనే రకాల తీవ్ర సమస్యలు వస్తాయి. కొందరిలో చల్లటి గాలి కారణంగా ముఖం పగిలిపోతుంది. అందహీనంగా కనిపించడమేకాకుండా ముఖంపై నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తగా పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల కూడా తీవ్ర సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ముఖం మృదువుగా మారడానికి చలికాలంలో హోం రెమెడీస్‌ని ఎలాంటి వాటిని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయి తొక్కతో ముఖం మృదువుగా మారుతుంది:
బొప్పాయిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని గింజల చర్మంపై అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీని కోసం బొప్పాయి తొక్కలను తీసుకుని వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తేనెను కలిపి ముఖానికి పట్టించాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. నీటితో కడిగేయాలి.
కొబ్బరి నూనె ఉపయోగించండి:
కొబ్బరి నూనె చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. రాత్రిపూట కొబ్బరి నూనె రాసుకుని పడుకుంటే చర్మం అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించాలి.
పాలు, బాదం నూనె:
బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. బాదం నూనెను పాలలో కలిపి అప్లై చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి. చలికాలంలో బాదం నూనె, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం పగిలిపోకుండా చర్మం మృదువుగా ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
Also Read: Ind Vs Zim: జింబాబ్వేతో భారత్ పోరు నేడే.. తేలనున్న సెమీస్ బెర్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి