Bitter Gourd Side Effects: కాకరతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకుంటే అంతే సంగతి..ఎందుకో తెలుసా?

Bitter Gourd Side Effects: కాకరకాయ, కొన్ని ఆహారాలను మిక్స్‌ చేసి తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో తీవ్ర పొట్ట సమస్యల కూడా రావచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 01:19 PM IST
 Bitter Gourd Side Effects: కాకరతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకుంటే అంతే సంగతి..ఎందుకో తెలుసా?

Bitter Gourd Side Effects: కాకరకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఈ కాకరకాయలు దివ్యౌషధంలా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్ స్థాయిని నియంత్రి, రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గింస్తుంది. అంతేకాకుండా కాకరను క్రమం తప్పకుండా తినేవారిలో మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే చాలా మంది కాకరను తినకూడని ఆహార పదార్థాలతో కలిపి తింటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ల ఉన్నాయి. ఏయే ఆహార పదార్థాల్లో కాకరను కలిపి తీసుకుంటే శరీరానికి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాలు, కాకరకాయ:
కాకరకాయతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినేవారు పాలను కలిపి తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

పెరుగు, కాకర:
కాకరకాయలను తిన్న తర్వాత చాలా మంది పెరుగును ఆహారంలో తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం కూడా శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్, కాకరలో ఉండే  పోషకాలు మిక్స్‌ అవ్వడం వల్ల చర్మ సమస్యల వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

మామిడి, కాకరకాయ:
వేసవి కాలంలో అందరూ మామిడిని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే కాకరతో తయారు చేసిన ఆహారాల్లో మామిడిని వినియోగించి తీసుకోవడం వల్ల కూడా తీవ్ర పొట్ట సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల వాంతులు, మంట, వికారం, ఎసిడిటీ  వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా కొందరిలో జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా వస్తాయి. 

కాకరకాయ, ముల్లంగి:
కాకరకాయ, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యల రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో ఎసిడిటీ, కఫం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలా కలిపి తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News