Capsicum Facts In Telugu: క్యాప్సికం మార్కెట్లో వివిధ రంగుల్లో మనం తరచుగా చూస్తాం.. అంతేకాకుండా చాలా మంది వీటిని వారంలో ఒక్కరోజైనా ఆహారాల్లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా క్యాప్సికం తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6 అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా క్యాప్సికం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. క్యాప్సికాన్ని క్రమం తప్పకుండా పచ్చిగా తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
క్యాప్సికం తినడం వల్ల కలిగే లాభాలు:
1. రోగ నిరోధక శక్తి:
క్యాప్సికంలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారాల్లో ఎక్కువగా వినియోగించడం వల్ల శరీరంలో ఒక్కసారిగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కొందరు వీటిని ప్రతి రోజు తిడనం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
2. గుండె సమస్యలకు:
క్యాప్సికంలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమందిలో రక్తపోటును కూడా ఎంతో సులభంగా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుండె జబ్బులు రాకుండా కూడా రక్షిస్తుంది.
3. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
క్యాప్సికంలో క్యాప్సైసిన్ అనే పదార్థం కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇప్పటికే క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారాల్లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
4. చర్మం ఆరోగ్యానికి మేలు:
క్యాప్సికంలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువు చేసేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది ముడతలు పడకుండా నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
6. వెయిట్ లాస్‌కు సహాయపడుతుంది:
క్యాప్సికంలోని క్యాప్సైసిన్ శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. దీంతో పాటు అనేక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
7. నొప్పులను తగ్గిస్తుంది:
క్యాప్సికంలోని క్యాప్సైసిన్ అనే మూలకం నొప్పిలను తగ్గించేందుకు కూడా చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా మోకాలి నొప్పి, తలనొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.