Carrots For Diabetics: క్యారెట్స్‌ను చాలామంది ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిరోజు వీటిని తినేవారికి శరీరానికి పోషకాలు విటమిన్స్ మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు వీటిని ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అని అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలామంది డయాబెటిస్తో బాధపడుతున్న వారు వీటిని తినాలా? వద్దా? అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఇవి నోటికి తీయదనాన్ని అందిస్తాయి. అందుకే చాలామంది మధుమేహంతో బాధపడేవారు వీటిని తినాలా వద్దా? అని తికమాక పడుతూ ఉంటారు. అయితే మధుమేహం ఉన్నవారు క్యారెట్లను ప్రతిరోజు తినొచ్చా? తినడం వల్ల ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి చాలామంది వైద్యులు క్యారెట్ల తినకూడదు అని మధుమేహంతో బాధపడుతున్న పేషెంట్లకు చెబుతూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం. నిజానికి వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ప్రతిరోజు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు కూడా ప్రభావంతంగా కృషి చేస్తాయని వారు అంటున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు క్యారెట్లను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు శరీరానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి దీని కారణంగా సులభంగా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యారెట్లను సూప్‌గా లేదా జ్యూస్ లా తయారుచేసుకొని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు గుండె సమస్యల బారిన పడకుండా ఉంటారు.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి