Cauliflower Side Effects: కాలీఫ్లవర్ చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది పకోడాలుగా చేసుకుని కూడా ఆహారంలో తీసుకుంటారు. అయితే చాలా మంది వీటితో తయారు చేసిన ఆహారాలు అతిగా తింటున్నారు. ఇలా తినడం
వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో చాలా రకాల పోషకాలున్న ప్రతి రోజూ తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని అతిగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాలీఫ్లవర్ అతిగా తినడం హానికరమా?
కాలీఫ్లవర్ ఎంత అందంగా కనిపిస్తుందో శరీరానికి కూడా అంతే మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుణులు తెలుపుతున్నారు. మన ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. అలాంటప్పుడు దీనిని అతిగా తినడం వల్ల ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు సందేహం కలుగొచ్చు. అయితే కాలీఫ్లవర్‌ను అతిగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. కడుపులోని గ్యాస్:
క్యాలీఫ్లవర్‌లో రాఫినోస్ అనే మూలకం అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో విచ్ఛిన్నమై పొట్ట సమస్యలకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్యాస్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
2. థైరాయిడ్ సమస్య:
కాలీఫ్లవర్ అతిగా వినియోగించడం వల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
3. రక్తంలో మార్పులు:
కాలీఫ్లవర్‌లో పొటాషియం అధికంగా లభిస్తుంది. కాబట్టి దానిని రెగ్యూలర్ తీసుకుంటే రక్తంలో మార్పలు సంభవించి గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. కాబట్టి తప్పకుండా వీటిని అతిగా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
ఇది కూడా చదవండి : Honda Cars Prices: హోండా కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్
ఇది కూడా చదవండి : PAN Card, Aadhaar Card Linking: పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింకింగ్ ఎవరెవరికి అవసరం లేదంటే..
ఇది కూడా చదవండి : 7 Seater Car: నెక్సాన్ ధరలోనే 7 సీటర్ ఎస్‌యూవి కారు.. బేస్ వేరియంట్‌లోనే జబర్ధస్త్ ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK