Coconut Water Mist for Pimples and Blemishes: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ నీళ్లలో విటమిన్ సి ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ఈ నీళ్లు ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
కొబ్బరినీళ్ళను ఫేస్ మిస్ట్‌గా తయారుచేసి ప్రతిరోజు వినియోగించడం వల్ల చర్మంపై ఉన్న నల్లటి వలయాలు తొలగిపోవడమే కాకుండా చర్మం అందంగా మృదువుగా తయారవుతుంది. కాబట్టి వేసవిలో తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఫేస్ మిస్ట్ వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్ల ఫేస్ మిస్ట్ తయారు చేయడానికి కావాలసిన పదార్థాలు:
- ఒక కప్పు కొబ్బరి నీళ్లు
- ఒక దోసకాయ
Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
కొబ్బరి నీళ్లను ఫేస్ మిస్ట్ తయారీ పద్ధతి:
- ముందుగా కోకోనట్ వాటర్ ఫేస్ మిస్ట్ ను తయారు చేయడానికి దోసకాయని తీసుకోవాల్సి.
- తర్వాత దోసకాయను బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత దోసకాయను ముక్కలుగా చేసుకుని గ్రైండర్లో జ్యూస్ చేసుకోవాలి.
- ఇలా తయారు చేసుకున్న జ్యూస్ వడగట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే జ్యూస్ లో కొబ్బరి నీళ్లను కలిపాలి.
- ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నుంచి ఫ్రిడ్జ్ లో రెండు గంటల పాటు ఉంచుకోవాలి.
- అంతే సులభంగా ఫేస్ మిస్ట్ రెడీ అయినట్లే.. వేసవిలో ప్రతిరోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook