Diabetes Control by Fenugreek seeds: వంటల రుచిని పెంచేందుకు మెంతి గింజలు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో డయాబెటిస్‌ను నియంత్రించే మూలకాలున్నాయని.. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వ్యాధి గ్రస్తులు వీటిని ఎలా తినాలో తెలుసుకుందాం..
మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి:
ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మెంతులు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఉదయం పూట నీటిని తాగిన తర్వాత మెంతులను నమిలి తినాలి. ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల సమస్య దూరమవుతుంది.
మెంతి గింజల ప్రయోజనాలు:
మెంతి గింజల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. అమైనో ఆమ్లాలు రక్తంలో ఉన్న చక్కెరను నియంత్రించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
మెంతులు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి:
ఈ గింజలను పరిమిత పరిమాణంలో మాత్రమే వినియోగించాలి. అతిగా తినడం వల్ల శరీర సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు తెలుపుతున్నారు. కేవలం ప్రతిరోజూ 10 గ్రాముల మెంతులు మాత్రమే తిసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Worst Breakfast Food: మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినొద్దు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook