Pigeon Feather: పావురాలు వల్ల మన ఆరోగ్యాన్నికి ముప్పు!

Pigeon Feather Disease: పాపురాలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వాటికి  బియ్యం వేస్తూ టైమ్‌పాస్‌ కోసం ఆహారం కూడా పెడుతాం. కానీ వీటి వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతామని వైద్యులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 08:36 PM IST
Pigeon Feather: పావురాలు వల్ల మన ఆరోగ్యాన్నికి ముప్పు!

Pigeon Feather Disease: పాపురాల నుంచి అలెర్జీలు, అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్‌ బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసుల ఎక్కువగా పెరుగుతున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  అయితే పావురం ఈకలు, పావురం శరీరంలోని దుమ్ము నుంచి కూడా సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటి వల్ల ఊపిరితిత్తుల సమస్యల ఎక్కువగా వస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలెర్జీ బాధితులకు ఈ పావురం వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌  చాలా ప్రమాదకరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఈ పావురం ఒక వల్ల కలగే ఇన్ఫెక్షన్.

అంతేకాకుండా పావురం రెట్టలు కూడా ఎంతో ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  పావురం రెట్టలు తరచుగా వ్యాధికారక బాక్టీరియా, వైరస్‌లు కలిగి ఉంటాయి.  వీటి వల్ల వచ్చే హిస్టోప్లాస్మోసిస్‌ వంటి ఫంగస్‌ బారిన పడాల్సి ఉంటుంది.  పావురం రెట్టలు ఎండిపోవడం వల్ల ఈ ఫంగస్‌ ఏర్పడుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

పావురం రెట్టల్లోని బ్యాక్టీరియా మనుషులకు చేరితే కడుపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పావురం శరీరంపై  ఉండే చిన్నపాటి పురుగులు మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.  ఈ సూక్ష్మజీవులు ర్మ అలెర్జీలు, అంటువ్యాధులు, కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read Dry Skin Treatment: చర్మం పొడిగా ఉంటుందా? ఈ టిప్స్‌ని ట్రై చేయడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతం

కాబట్టి పావురం రెట్టలను ఎప్పటికప్పుడు  శుభ్రరం చేయాలి. దీని కోసం చేతి తొడుగులు, షూ కవర్లు, మాస్క్‌లను ఉపయోగించడం మంచిది. రెట్టలను శుభ్రం చేసిన తర్వాత వాటిని మూసివున్నకవర్‌లో నిల్వ చేయాలి. వాటిని నిర్దేశించిన ప్రదేశాలలో పారవేసే ముందు బ్యాగ్‌ల వెలుపలి భాగాన్ని కూడా కడగడం చాలా మంచిది.

ఈవిధంగా పావురాలతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.  పావురాలను పంచడం కానీ వాటిని తాకడం వంటి పనులు చేయడం మంచిది కాదు. వాటి మేత వేసి పెంచడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read Ginger Tea Vs Ginger Water: ఆరోగ్యానికి అల్లం టీ బెస్టా..అల్లం వాటర్‌ బెస్టా?..తప్పకుండా తెలుసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News