Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..

Lady aghori car video: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసి లేడీ అఘోరీ మాత గురించి చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 19, 2024, 01:31 PM IST
  • తెలంగాణలో హల్ చల్ చేస్తున్న లేడీ అఘోరీ..
  • సనాతన ధర్మం కావాలని హితవు..
Lady Aghori: బాబోయ్.. లేడీ అఘోరీ కారులో ఉన్న వాటిని చూస్తే షాక్ కాదూ ‘షేక్’.. అయిపోతారు.. వీడియో వైరల్..

Lady Aghori matha car video goes viral: సికింద్రాబాద్ లో మోండా మార్కెట్ వద్ద ఉన్న ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించాడు. ఆ ఘటన ప్రస్తుతం తెలంగాణలో పెనుదుమారంగా మారింది. దీనిపై హిందు సంఘాలున్ని భగ్గుమంటున్నాయి. కేవలం ఒక మతాన్ని, వర్గాన్ని టార్గెట్ చేసుకొని, రెచ్చకోట్టేలా చేస్తున్నారని మండిపడ్డారు.అంతేకాకుండా.. దీనిపై ఇప్పటికి కూడా సికింద్రాబాద్ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు తమ నిరసనలను కొనసాగిస్తునే ఉన్నారు. నిందితుడిని మాత్రం కఠినంగా పనిష్మెంట్ చేయాలని కూడా స్థానికులు భారీ ఎత్తున డిమాండ్ లు చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. అమ్మవారి ఆలయంలో భక్తులు శుద్దీ కార్యక్రమంలో, శాంతి పూజలు పండితులు సహాయంలో నిర్వహిస్తున్నారు. అయితే.. ఇటీవల ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముత్యాలమ్మ ఆలయంలోకి ఒక్కసారిగా అఘోరీ నాగ సాధు మాత రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేదు. శరీరమంతా బూడిద పూసుకుని, కుంకుమ పెట్టుకుని, పుర్రెల మాలల్ని ధరించి ఉంది. అంతకాకుండా.. అఘోరీ మాత అమ్మవారి ఆలయంకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు సైతం చేసింది. గతంలో ఈ అఘోరీ మాత.. కొమురవెల్లి మల్లన్న, వేముల వాడ రాజన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు ముత్యాలమ్మ ఆలయంకు రావడం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఘోరీ మాత తన సొంత కారులో ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసంపై మాట్లాడారు. అఘోరీ మాత.. సనాతన ధర్మం కాపాడుకునే బాధ్యత ప్రతి  ఒక్కరిపై ఉందన్నారు. తాను చిన్న తనంలోనే అఘోరీగా మారినట్లు తెలిపారు. తనకు తాను.. 20 ఏళ్ల క్రితం పిండిపెట్టుకున్నట్లు తెలిపారు. అఘోరీలా మారడం అంతసులువు కాదన్నారు.

ఏన్నో ఏళ్లు కఠోరంగా ఉంటే తప్ప.. అఘోరీలుగా మారలేరన్నారు. తాము.. ఉజ్జయినీ, కాళీ, కేదార్ నాథ్ తదితర ప్రాంతాల్లో స్మశానంలోని శవాలను తింటామని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు వెయ్యికి పైగా శవాల్ని తిన్నట్లు కూడా అఘోరీ మాత చెప్పుకొచ్చింది. 
ఇతరమతాలను గౌరవిస్తునే, మన ధర్మంను కాపాడుకొవాలన్నారు. అంతే కాకుండా.. ఇలాంటి ఘటనలపై మాత్రం గట్టిగా పోరాడాలన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అఘోరీ మాతకు చెందని కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఘోరీ మాత నడిపిస్తు వచ్చిన కారులో.. ముందు వైపు నెంబర్ ప్లేట్ స్థానంలో..డెంజర్.. అఘోరీ నాగ సాధు.. డెంజర్అని రాసి పెట్టి ఉంది. కారుకు నాలుగు వైపులా కూడా కాళీక మాత ఫోటోలు, కొమురవెల్లి మల్లన్నఫోటోలు, శివుడు ధ్యానం చేస్తున్న ఫోటోలు ఉన్నాయి. ఇక కారులు.. పుర్రెలు, జపమాలలు, ఆసనాలు, శివపూజ కోసం ఉపయోగించే వస్తువులు ఉన్నాయి. తన గురువు కాశీ విశ్వనాత్ ఆధ్వర్యంలో తాను.. అఘోరీగా మారినట్లు చెప్పారు.

Read more: Muthyalamma: ధ్వంసం చేసిన చోట ఐక్యతారాగం.. బోనాలతో ముత్యాలమ్మ ఆలయానికి పునరుజ్జీవం

అంతేకాకుండా.. కారు మీద డెంజర్ లేడీస్ డేంజన్ అని కూడా రాసి పెట్టిఉంది.పుర్రెల మాలలు ఉన్నాయి. కారంతా కూడా బూడిదతో నిండి ఉంది.  అఘోరీ మాత నిత్యం స్టేట్స్ లను దాటి ప్రయాణిస్తుంటారు. అందుకే వీరికి  ఒక రిజిస్ట్రేషన్ నంబర్ లేదని తెలుస్తోంది.  ఏది ఏమైన ప్రస్తుతం అఘోరీ మాత కారు వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News