Egg Noodles Recipe: వేడివేడి నోరూరించే ఎగ్ నూడిల్స్..కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోండి ఇలా..

Egg Noodles Recipe Indian Style In Telugu: చాలామంది బయట తయారుచేసి నూడిల్స్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మేము అందించే సులభమైన పద్ధతిలో తయారుచేసుకొని తింటే రెస్టారెంట్లో లభించే నూడిల్స్ రుచిని పొందుతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2024, 10:30 PM IST
Egg Noodles Recipe: వేడివేడి నోరూరించే ఎగ్ నూడిల్స్..కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకోండి ఇలా..

 

Egg Noodles Recipe Indian Style In Telugu: చాలామంది సాయంత్రం అయిందంటే చాలు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల వ‌ద్ద సెంటర్ల వద్ద క్యూ కడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎగ్ నూడిల్స్ చికెన్ నూడిల్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక పిల్లలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అయితే బయట లభించే ఈ నూడిల్స్ అనారోగ్యకరమైనప్పటికీ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇకనుంచి ఇలా చేయనక్కర్లేదు ఏం చక్క.. ఇంట్లోనే ఎగ్ నూడిల్స్ ను తయారు చేసుకోవచ్చు. మీ మందించి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా ఈ నూడిల్స్‌ను తయారు చేసుకోవడం వల్ల సులభంగా రెస్టారెంట్ స్టైల్ లో టేస్ట్ ను పొందవచ్చు. అయితే ఈ నూడిల్స్‌కు కావలసిన పదార్థాలు ఏంటో.. వీటిని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
160 గ్రాముల దొడ్డు నూడిల్స్
ఏడు గ్లాసుల నీళ్లు
నాలుగు కోడిగుడ్లు
రుచికి సరిపడా ఉప్పు
రుచికి సరిపడా నల్ల మిరియాలు
చిన్నగా తరుముకున్న వెల్లుల్లి తురుము
పొడవుగా కట్ చేసుకున్న ఎర్రని ఆనియన్స్
పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు
ఒక చిన్న కప్పు క్యాప్సికం ముక్కలు
పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజీ తురుము
రెండు టేబుల్ స్పూన్ల టమాట సాస్
ఒక చిన్న కప్పు కారం
డార్క్ సోయాసాస్ రెండు టేబుల్ స్పూన్ల
ఒక టేబుల్ స్పూన్ వెనిగర్

తయారీ పద్ధతి:
ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో మూడు కప్పుల నీళ్లను వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులోనే ఉప్పు నీటిని వేసుకుని మరో అయిదు నిమిషాల పాటు తెర్ల కాగనివ్వాలి. ఇందులో నూడిల్స్ వేసుకొని 80 శాతం వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటిని బాగా వడకట్టుకొని ఈ నూడిల్స్ పైనుంచి చల్లని నీటిని పోసుకొని, ఓ గిన్నెలో పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నాలుగు గుడ్ల సోనను తీసుకొని అందులోనే ఉప్పు, తగినంత మిర్యాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. 

ఆ తర్వాత స్టవ్ పై ఓ కళాయి పెట్టుకుని అందులో నూనెను బాగా వేడి చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి. ఇలా వేయించుకున్న కోడిగుడ్ల ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, మరోసారి బాగా వేడి చేసుకుని అందులోనే అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, క్యాబేజీ తురుము, క్యారెట్ వేసుకొని మరోసారి చిటపటలాడే లాగా వేయించుకోవాలి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 ఆ తర్వాత అందులోనే మరోసారి నల్ల మిరియాల పొడి టమాట సాస్ ఉప్పు వెనిగర్‌ని వేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. వీటిని హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఉడికించిన నూడిల్స్‌ను వేసుకొని, మరోసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న వెంటనే వేయించిన కోడిగుడ్లు వేసుకొని, కొత్తిమీర తురుము, మిగతా అన్ని పదార్థాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుని పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటే, అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో లభించే నూడిల్స్ రుచిని కలిగి ఉంటాయి.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News