Foxtail Millet: షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ చేయడంలో కొర్రల ప్రయోజనాలు ఇవే!

Foxtail Millet Uses: మనం సాధారణంగా  తెల్లటి బియ్యం తీసుకుంటూ ఉంటాము. దీనికి బదులుగా  కొర్ర బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 11:37 PM IST
Foxtail Millet: షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ చేయడంలో కొర్రల ప్రయోజనాలు ఇవే!

Foxtail Millet Uses: చిరుధాన్యాల్లో  కొర్రలు కూడా ఒకటి.  దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఈ కొర్రల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.

అంతేకాకుండా నాడీ వ్యవస్థను మెరుగు చేస్తుంది. జుట్టు సమస్యతో బాధపడుతున్నవారు ఈ కొర్ర బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. అంతేకాకుండా మలబద్దం వంటి 
సమస్యతో బాధపడుతున్నవారు ఈ కొర్ర బియ్యంను తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

కొర్ర బియ్యం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.  టైప్-2  డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో ఈ కొర్రలు ఎంతో ఉపయోగపడతాయి.  దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇతర క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. 

రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు కొర్రలు తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. కొర్రలతో మనం దోశ , చపాతి వంటి ఆహారా పదార్థాలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కొర్రలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు  కొర్రలు తింటే శరీరంలోని చెడు కొలెస్టరాల్ స్థాయిని తగ్గించి బరువు తగ్గుతారు.

బెల్స్ పాల్సీ వంటి వ్యాధితో బాధపడుతున్నవారు రోజు కొర్రలు  తింటే చక్కటి ఫలితం పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

కొర్రలు  తినడం వల్ల మూత్రంలో కలిగే మంట సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కొర్రలని తింటే శరీరం లోనే షుగర్ లెవెల్స్  అదుపులో ఉంటాయి.

Also Read Elephant Yam: కంద దుంప లాభాలు గురించి తెలిస్తే షాక్‌ అవుతారు!

కొర్రలలో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొర్రలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లైంగిక సమస్యలు కూడా దూరం అవుతాయి ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా కొర్రలను తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిని తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read White Hair: రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టు సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News