Elephant Yam: కంద దుంప లాభాలు గురించి తెలిస్తే షాక్‌ అవుతారు!

Benefits Of Elephant Yam: కంద దుంపని అతి తక్కువగా వండుకుంటారు. కానీ దీని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 03:13 PM IST
Elephant Yam: కంద దుంప లాభాలు గురించి తెలిస్తే షాక్‌ అవుతారు!

Benefits Of Elephant Yam: కంద దుంపను వివిధ పేర్లుతో పిలుస్తారు. దీని ఎలిఫెంట్‌ యమ్ అని కూడా పిలుస్తారు. ఈ కందను ముక్కలుగా చేయడం వల్ల ఇది ఏనుగు పాదాల్లా కనిపిస్తాయి. అందుకే ఈ పేరు వచ్చింది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కంద దుంప వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

కంద దుంపలో అనేక రకమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, చెడు కొలెస్ట్రాల్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  కంద దుంపలో పొటాషియం, ఫైబర్ వంటి గుణాలు ఉంటాయి.  చిన్న కంద దుంప దల్ల ఆరు గ్రాముల ఫైబర్‌ను పొందవచ్చు.  దీని తీసుకోవడం వల్ల ఊబకాయం, షుగర్‌ బారిన పడకుండా కాపాడుతుంది.

కంద వల్ల క్యాన్సర్ గుణాలు పెరగకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నవారు కందని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.  డయేరియా సమస్యతో బాధపడుతున్నవారు లేత కంద కాడలతో పులుసు చేసుకొని తినడం వల్ల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆకలిలేమి సమస్యతో బాధపడుతున్నవారు ఈ కందను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయటపడుతారు. 

మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచడంలో కంద మేలు చేస్తుంది. 

కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యతో బాధపడుతున్నవారు కందను తీసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడవచ్చు.

Also Read White Hair: రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టు సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు!

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కందలో అధికంగా లభిస్తాయి.  దీని వల్ల  జుట్టు, చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

ముసలితనం త్వరగా రాకూడ ఉండాలి అంటే కందను  తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్… ముసలితనం నుంచి కాపాడుతుంది.

డయబెటిస్ ఉన్నవారు కంద దుంపను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ , గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటాయి కాబట్టి కందను డయబెటిస్‌ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతారు.

అయితే చిన్నపిల్లలు, కడుపుతో ఉన్నవారు, తల్లిపాలు ఇస్తున్న మహిళలు ఈ కందను తీసుకోవడం అంతమంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read Pomegranate Facts: దానిమ్మపండు తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News