Garden Cress Seeds Benefits: గార్డెన్ క్రెస్ విత్తనాలను చాలా మంది హలీమ్ విత్తనాలుగా పిలుస్తారు. ఈ విత్తనాలు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకు ఇందులో గుణాలు ఎంతగానో సహాయపడతాయి. అందుకే చాలా మంచి వీటిని సలాడ్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ విత్ననాల్లో ఉండే ఔషధ గుణాలు రక్తహీనత వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే పీరియడ్స్ కారణంగా వచ్చే సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు ఇది శరీరానికి ఇతర ప్రయోజనాలను అందిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని ఆహారాల్లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హలీబ్ విత్తనాలలో ఉండే పోషకాలు:
హలీమ్ గింజల్లో ఎక్కువ పరిమాణంలో పీచు పదార్థం లభిస్తుంది. ప్రతి వంద గ్రాముల ఈ విత్తనాల్లో 40.37 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అంతేకాకుండా 22.4 గ్రాముల ప్రోటీన్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, ఫాస్పరస్, నియాసిన్, కొవ్వు, పిండి పదార్ధాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్ కూడా ఉంటుంది.
ప్రయోజనాలు:
బరువు తగ్గిస్తుంది:
హలీమ్ గింజల్లో ఎక్కువ మోతాదులో ఫైబర్ లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ విత్తనాలను ఆహారాల్లో చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా పొట్ట ఎల్లప్పుడు నిండుగా ఉంటుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా శరీరం దృఢంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
హలీమ్ విత్తనాల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్లు ఎ, సి, ఇలు కూడా ఎక్కువగా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు అల్పాహారంలో చేర్చుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది.
రక్తహీనత:
రక్తహీనతతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా పెరిగిపోతోంది. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు హలీమ్ విత్తనాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు సహాయపడతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మలబద్ధకం సమస్యకు చెక్:
ప్రతి రోజు పీచు పదార్థాలు అధిక మోతాదులో లభించే హలీమ్ గింజలను తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు అజీర్ణం, పొట్ట సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి