Ginger Oil For Hair: అల్లం నూనె జుట్టు సంరక్షణలో ఒక అద్భుతమైన సహజ ఉత్పత్తి. దీనిలోని అనేక గుణాలు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అల్లంలోని జింజెరోల్ అనే పదార్థం తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు పెరుగుదల వేగంగా జరుగుతుంది. యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును కలిగించే శిలీంద్రాలను నాశనం చేస్తాయి. అల్లం నూనె తల చర్మం ఎండిపోవడం, చికాకు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. అల్లం నూనె జుట్టుకు మెరుపునిచ్చి, మృదువుగా చేయడంలో సహాయపడుతుంది.
అల్లం నూనెను ఉపయోగించే విధానాలు:
డైరెక్ట్ అప్లికేషన్:
తల స్నానం చేయడానికి ముందు, తల చర్మంపై కొద్దిగా అల్లం నూనెను నేరుగా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత, గోరువెచ్చటి నీటితో కడిగి, మిల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోండి.
నూనెల మిశ్రమం:
అల్లం నూనెను కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా జొజోబా ఆయిల్ వంటి ఇతర నూనెలతో కలిపి మసాజ్ చేయండి. ఈ మిశ్రమం తల చర్మాన్ని మరింత పోషిస్తుంది.
హెయిర్ మాస్క్:
అల్లం నూనెను యోగర్ట్, గుడ్డు, హనీ లేదా మెంతుకు పొడి వంటి పదార్థాలతో కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించండి. ఈ మాస్క్ జుట్టును బలపరుస్తుంది మృదువుగా చేస్తుంది.
పదార్థాలు:
అల్లం
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె
గాజు బాటిల్
కత్తి
చిన్న గిన్నె
వడకట్టి
తయారీ విధానం:
తాజా అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోసి లేదా తురుముకోండి. ఒక గాజు బాటిల్ తీసుకొని దాన్ని సగం వరకు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో నింపండి. తరువాత, తురుముకున్న అల్లం ముక్కలను నూనెలో వేసి బాగా కలపండి. ఈ బాటిల్‌ను నీటితో నిండిన పాత్రలో ఉంచి, స్టౌ మీద వేడి చేయండి. నీరు మరిగే వరకు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత, బాటిల్‌ను స్టౌ నుండి తీసి చల్లబరచండి. చల్లారిన తర్వాత, ఒక వడకట్టి ద్వారా నూనెను వేరొక గాజు బాటిల్‌లోకి వడకట్టండి. ఈ బాటిల్‌ను చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి.
గమనిక:
ఈ నూనెను కనీసం 2-3 వారాలు వరకు నిల్వ చేయడం మంచిది. ఈ కాలంలో నూనె అల్లం గుణాలను మరింతగా గ్రహిస్తుంది. ఈ నూనెను తల చర్మంపై మసాజ్ చేయడానికి లేదా ఇతర హెయిర్ మాస్క్‌లలో కలపడానికి ఉపయోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Ginger For Hair: అల్లం ఆయిల్ ను ఇలా జుట్టుకు రాస్తే.. అన్ని సమస్యలకు చెక్..!