Hair Care Tips: జట్టు ఆరోగ్యంగా..అందంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలు, కండీషనర్లు వినియోగిస్తుంటారు. అయితే కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోకపోతే..మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
హెయిర్ కేర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే రోజంతా బయట తిరిగేటప్పుడు దుమ్ము ధూళికి ఎక్స్‌పోజ్ అవడంతో జుట్టు త్వరగా పాడైపోతుంటుంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు హెయిర్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఆయిలింగ్, షాంపూ చేస్తే సరిపోదంటున్నారు బ్యుటీషియన్లు. కాలుష్యం నుంచి కాపాడేందుకు చాలా చేయాల్సి ఉంటుంది. త్వరగా జుట్టు తెల్లబడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అన్ని సమస్యల్నించి గట్టెక్కేందుకు జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా చేసుకోవాలి. దీనికోసం పోషక పదార్ధాలు అందించాలి. అందుకే షాంపూ తరువాత కండీషనింగ్ చేస్తుంటారు. అంటే జుట్టును నరిష్డ్ ప్రొడక్ట్‌తో కోటింగ్ ఇస్తారు. ఫలితంగా జుట్టుకు మృదుత్వం రావడమే కాకుండా జుట్టును పటిష్టం చేస్తుంది. అయితే ఈ క్రమంలో కొన్ని తప్పులు సహజంగా చేస్తుంటాం. ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి. కండీషనింగ్ సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
చాలా సందర్భాల్లో తెలిసో తెలియకో..శుభ్రంగా లేని తలపైనే కండీషనింగ్ అప్లై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టుకు చాలా నష్టం కలుగుతుంది. అందుకే జుట్టుకు కండీషనర్ రాసేముందు షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాతే కండీషనర్ అప్లై చేయాలి. ఇంకొంతమంది మహిళలు..ఎక్కువసేపు కండీషనర్ పెట్టుకుంటే బాగుంటుందనుకుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మార్కెట్‌లో తయారయ్యే కండీషనర్‌లు తలకు ఎంతసేపు పెట్టుకోవాలనే విషయంలో నిర్ణీత సమయం ఉంటుంది. ఆ నిర్ణీత సమయం వరకే పెట్టుకోవాలి.
హెయిర్ కేర్ విషయంలో మరో ముఖ్యమైన సాధారణంగా కన్పించే తప్పు కండీషనింగ్ తరువాత వేడి నీళ్లతో జుట్టు కడగడం. వేడి నీళ్లతో కడిగితే కండీషనర్ పూర్తిగా పోతుందని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. చల్లటి నీళ్లతోనే శుభ్రం చేసుకోవాలి.
Also read: Cold Milk Benefits: పాలు తాగే అలవాటుందా..అయితే కోల్డ్‌మిల్క్ తాగండి, బరువు తగ్గించుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook