/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Hair Fall Problems: జట్టు ఎక్కువగా ఉండటం వల్ల మనిషి అందంగా కనిపిస్తాడు. అంతేకాకుండా ఎక్కువ మంది వారిని ఇష్టపడతారు. జట్టు రాలిపోవటం అనే సమస్య స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఉంటుంది.  అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం(hair fall) జరుగుతుంది. జుట్టు(hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది. వీటిని నివారించుకోవడానికి (Hair fall treatment) మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కంటే ఇంట్లో దొరికి పదార్థాలతో తయారు చేసుకున్న చిట్కాలు (tips) మంచి ఫలితాలను ఇస్తాయి.

ఒకప్పుడు ప్రకృతిలో దొరికే కుంకుడు కాయలతో తలస్నానం చేసేవారు. అందువల్ల జట్టు పెద్దగా ఊడేది కాదు. కానీ  ఇప్పటి కాలుష్యం, షాంపూలు (shampoo), హెయిర్ ప్రొడక్ట్స్ పూర్తిగా రసాయనాలకు అలవాటు పడిపోయారు జనం. ఇవి జుట్టుకు ఎంతో నష్టం చేస్తున్నాయి. అందుకే ఇంట్లోని సహజ పదార్ధాలతో జట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

Also Read: Best weight loss foods: బరువు తగ్గేందుకు బెస్ట్ ఫుడ్ ఐటమ్స్

కలబంద.. కేశాలకు అండ
కలబంద (Aloe Vera) వల్ల మనుషులకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే జుట్టుకు, చర్మానికి కూడా కలబంద చాలా ఉపయోగపడుతుంది.  కలబంద (Aloe Vera), కొబ్బరి నూనె (Coconut oil) , ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ నూనె తయారీకి మొదట చేయవలసిన పని ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ రసం తాజాగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కలబంద పేస్ట్ ను , కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు జుట్టుకు పూయాలి.  తద్వారా మీ జుట్టు అందంగా (Beauty), మందంగా, పొడవుగా (long) బలంగా కనిపిస్తుంది. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ (olive Oil) కలిపి తలమీద పూయడంవల్ల చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఉల్లిపాయ రసంతో చుండ్రుకు చెక్
జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు (dandruff) కూడా ఒకటి. సరైన పోషకాలను అందించకపోతే చుండ్రు తో సహా ఇతర సమస్యలు కూడా వస్తాయి. జుట్టు రాలడాన్ని(hair fall) నివారించడానికి ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణ దినచర్యలో చేయడానికి ప్రయత్నించండి. మీ జుట్టుకి  ఉల్లిపాయ రసం (Onion Juice) తీసుకొని, అందులో ఒకటి నుండి రెండు టీ స్పూన్ల తేనె కలిపి,  ఈ మిశ్రమాన్ని మీ తల తో సహా జుట్టు అంతా రాయండి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. అంతేకాకుండా మంచి ఆహారం కూడా మీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Hair fall? Reasons why it can happen
News Source: 
Home Title: 

మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందా? అయితే ఇంట్లోనే ఇలా చేయండి..

Hair Fall Problems: మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందా? అయితే ఈ చిట్కాతో చెక్ పెట్టండి
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందా? అయితే ఇంట్లోనే ఇలా చేయండి..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 14, 2021 - 13:13
Request Count: 
100
Is Breaking News: 
No