Morning Sickness: ఉదయం నిద్ర లేవగానే శరీరంలో బలహీనతగా అనిపిస్తుందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Remedies for Morning Sickness: ఉదయం లేవగానే శరీరం అలసటగా, బలహీనంగా అనిపిస్తుందా? అలా అయితే, ఈ సమస్యకు శాశ్వతంగా ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 11:36 AM IST
Morning Sickness: ఉదయం నిద్ర లేవగానే శరీరంలో బలహీనతగా అనిపిస్తుందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

Remedies for Morning Sickness: మీరు ఉదయం నిద్రలేవగానే శరీరం అలసిపోయి బలహీనంగా అనిపిస్తుందా. ఇది మీ దిన చర్యను కూడా ప్రభావితం చేస్తుందా? అలా అయితే, ఈ సమస్యను (Morning Sickness) పరిష్కరించడానికి మీకు ఖచ్చితమైన పరిష్కారాన్ని తెలియజేస్తాం.

టైం సెట్ చేసుకోండి
మెుదటగా మీరు నిద్రపోయే సమయాన్ని, మేల్కొనే టైంను సెట్ చేసుకోండి. నిర్ణీత సమయానికి పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలా కాకుండా మీరు సరిగా నిద్రపోకపోతే అది మీ ఉదయపు దినచర్యను ప్రభావితం చేస్తుంది. కాబట్టి రాత్రిపూట 7-8 గంటలు పడుకోవడానికి ప్రయత్నించండి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగాలి
ఉదయం లేవగానే అర లీటరు గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది మరియు జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పని చేస్తుంది. ఫ్రెష్ అయిన తర్వాత, మీరు జాగింగ్ లేదా 20-30 నిమిషాల పాటు నడవండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది మరియు మీ ముఖం మరియు శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. 

అల్పాహారంలో ప్రోటీన్ పుడ్ తీసుకోండి
స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది. వీటిని తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటుంది. దీనితో పాటు, మీ మూడ్ కూడా మారుతుంది. 

కరివేపాకు రసం 
మీరు ఉదయాన్నే నీటిలో కరివేపాకు (Curry Leaves), నిమ్మకాయ మరియు పంచదార కలపి.. రసం తయారుచేయాలి. ఈ రసాన్ని  తాగడం వల్ల మీ మార్నింగ్ సిక్ నెస్ పోతుంది. మీరు ప్రతిరోజూ ఒక గ్లాసు ద్రావణం తాగితే, దాని ప్రభావం మీ మొత్తం శరీరంపై చూపడం ప్రారంభమవుతుంది. అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ 2 గ్రాములు అంటే 8-10 కరివేపాకులను తినవచ్చు. కావాలంటే కరివేపాకు టీని కూడా తీసుకోవచ్చు. ఇది ఉదయం అలసటను తొలగిస్తుంది.

Also Read:,Pomegranate Side Effects: దానిమ్మ పండు తినడం వల్ల కలిగే అనర్థాలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News