Pomegranate Side Effects: దానిమ్మ పండు తినడం వల్ల కలిగే అనర్థాలు!

Pomegranate Side Effects: దానిమ్మ మన శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ అధిక మొత్తంలో దాని ఉపయోగం హానికరమని కొంతమంది నిపుణులు అంటున్నారు. దానిమ్మ విత్తనాలు లేదా జ్యూస్ అతిగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 10:28 AM IST
Pomegranate Side Effects: దానిమ్మ పండు తినడం వల్ల కలిగే అనర్థాలు!

Pomegranate Side Effects: ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు మనలో చాలా మంది పండ్లను తింటుంటారు. పండ్లు తినడం వల్ల శరీరానికి అనేక పోషక మూలకాలు అందుతాయని అందరికి తెలిసిన విషయమే. పండ్లలో దానిమ్మ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో రక్తం కొరత తగ్గుతుంది. కానీ, దానిమ్మ పండును అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు దానిమ్మ అతిగా తినడం వల్ల ఎదురవుతాయి. వీటితో పాటు దానిమ్మ అతిగా తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. 

గొంతునొప్పి, దగ్గు..

దానిమ్మ పండును అతిగా తినడం వల్ల దగ్గు సమస్య రావొచ్చు. దీని వల్ల గొంతు నొప్పికి కారణమయ్యే అవకాశం కూడా ఉంది. గొంతు నొప్పిని కారణమయ్యే దానిమ్మ పండులో అలాంటి మూలకాలు ఉన్నాయి. గొంతునొప్పి ఉన్నప్పటికీ దానిమ్మపండును తింటే అది దగ్గుకు కారణం కావచ్చు.

చర్మంపై అలెర్జీల ప్రమాదం

మీరు దానిమ్మపండును ఎక్కువగా తీసుకుంటే అది అలెర్జీకి దారి తీయవచ్చు. దానిమ్మపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ఎర్రటి దద్దుర్లు రావడంతో పాటు అలర్జీలు కూడా రావచ్చు. 

అసిడిటీ సమస్య..

దానిమ్మ పండును ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. శరీరానికి దాని స్వంత స్వభావం ఉంటుంది. దానిమ్మ పండు రుచి చల్లదనాన్నిస్తుంది. దానిమ్మపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. అటువంటి పరిస్థితిలో దానిమ్మపండును ఎక్కువగా తినకపోవడమే మేలు.   

Also Read: StrawBerry Legs:షేవింగ్ వల్ల మీకు స్ట్రాబెర్రీ కాళ్లు వచ్చాయా? స్ట్రాబెర్రీ కాళ్ల నివారణకు సహాయపడే చిట్కాలు

ALso Read: Dandruff Home Remedies: చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి శాశ్వత పరిష్కారం ఇదిగో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News