High Protein Sweets: ఈ ఐదు రకాల స్వీట్లతో శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!

High Protein Sweets: ప్రోటీన్ రోజువారీ ఆహారంలో ఒక అంతర్భాగం. ఇది కండరాలు, కణజాలాలను మెరుగుపరిచి వీటి నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది ప్రొటీన్‌లైన..మాంసం, కోడిగుడ్లు వంటి మాంసాహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2022, 09:56 AM IST
  • ఐదు రకాల స్వీట్లతో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు
  • మిల్క్ కేక్‌తో శరీరానికి చాలా ప్రోటీన్లు
  • శరీరంలో ప్రోటీన్ల కోరతను నియంత్రిస్తుంది
High Protein Sweets: ఈ ఐదు రకాల స్వీట్లతో శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!

High Protein Sweets: ప్రోటీన్ రోజువారీ ఆహారంలో ఒక అంతర్భాగం. ఇది కండరాలు, కణజాలాలను మెరుగుపరిచి వీటి నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది ప్రొటీన్‌లైన..మాంసం, కోడిగుడ్లు వంటి మాంసాహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు. అయితే శాకాహారులు ప్రొటీన్ అవసరాలను ఎలా తీర్చుకోవాలో ఈ కథనంలో తెలుసుకోవచ్చు. చాలా మంది మాంసం తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ ఐదు రకాల  స్వీట్‌లను తీసుకుంటే శరీరంలో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఆ స్వీట్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బేసన్ లడ్డు (Besan ke Laddu) :

బేసన్ లడ్డులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీనిని ఫోలేట్ అని కూడా అంటారు. దీని సహాయంతో గుండెలోని సిరలలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి.

ఖీర్ (Kheer):

ఖీర్ తయారీలో అధికంగా పాలను, నెయ్యిని వినియోగిస్తారు. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.అంతేకాకుండా ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.
కొంతమంది దీనిని తయారు చేయడానికి బెల్లం కూడా ఉపయోగిస్తారు. కావున ఇది ఆరోగ్య విలువను పెంచుతుంది.

మిల్క్ కేక్(Milk Cake):

మిల్క్ కేక్‌ను పాల నుంచి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రోటిన్లు లభిస్తాయి. అంతేకాకుండా దీనిని  రిచ్ ప్రొటీన్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. కాబట్టి ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

మిష్టి దోయి(Mishti Doi):

మిష్టి దోయిని పెరుగు, బెల్లం ఉపయోగించి తయారు చేస్తారు. కావున ఇందులో చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. మిష్టి దోయిని తినడం వల్ల జీర్ణక్రియలో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మూంగ్ దాల్ హల్వా (Moong Dal Halwa)

భారత్‌లోని ప్రతి వంటగదిలో మూంగ్ దాల్‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా దీనితో హల్వా కూడా తయారు చేస్తారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. కావున BP రోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతుంది.

 (NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Blood Group vs Heart Risk: ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు ముప్పు ఎక్కువో తెలుసా

Also Read: Heart Attack: గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే.. ఈ పండ్లను తీసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News