Instant Face Glow: శనగ పిండిని మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీన్ని వివిధ వంటకాల్లో ఉపయోగిస్తాం. శనగపిండితో వంటకాలు చేయడమే కాకుండా చర్మసంరక్షణలో కూడా ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇందులో అనేక రకాల సహజసిద్ధమైన పదార్థాలతో ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ మీ ముఖానికి సహజమైన మెరుపును తక్షణమే ఇస్తుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీనికి ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోండి. దీంతో మృదువైనా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
శనగపిండి- తేనె..
శనగపిండి రెండు స్పూన్లు, తేనె ఒక స్పూన్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. శనగపిండి వల్ల నేచురల్ గ్లో వస్తుంది. తేనె కూడా సహజ పెరుపును తీసుకువస్తుంది. తేనెతో మనం ఇంట్లోనే మంచి స్క్రబ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెండిటినీ ప్యాక్ మాదిరి తయారు చేసి సర్క్యూలర్ మోషన్లో సున్నితంగా రుద్దాలి. ఈ ఫేస్ ప్యాక్ పది నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో రుద్దుతూ ముఖం కడగాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మానికి తక్షణ గ్లో వస్తుంది.
ఇదీ చదవండి: Super Foods: మారుతున్న సీజన్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అనేక ప్రయోజనాలు..
శనగపిండి- టమాట..
టమాటలో విటమిన్ సీ ఉంటుంది. ఇది చర్మానికి తక్షణ గ్లో తీసుకురావడానికి సహాయపడుతుంది. రెండు స్పూన్ల శనగపిండిలో కాస్త టమాట రసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. వారానికి రెండుస్లార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మీకు మెరుగైన ఫలితాలు అందుతాయి. ఈ ప్యాక్ వేసుకన్న తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగండి.
శనగపిండి-పాలు..
ఈ రెండిటిని సమపాళ్లలో కలిపి పేస్ట్ మాదిరి తయారు చేసుకోండి. ఈ పేస్ ప్యాక్ తో ముఖం మొత్తం రుద్దుతూ ఉండండి. ఓ పదినిమిషాల తర్వాత ముఖం కడగాలి. ఇక్కడ జిడ్డు చర్మం ఉన్నవారు పాలు ఉపయోగించకూడదు. దానికి బదులుగా రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇదీ చదవండి: స్ట్రాబెర్రీ జ్యూస్ వల్ల ఇన్ని లాభాలు...తెలిస్తే ఈరోజు నుంచే తాగుతారు..
నిమ్మకాయ- శనగపిండి..
నిమ్మరసం అన్ని సౌందర్య సంరక్షణల్లో ఉపయోగిస్తారు. ఈ ప్యాక్ మీ ముఖంపై పేరుకున్న ట్యాన్ తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ ముఖానికి తక్షణ గ్లో ఇవ్వడానికి తోడ్పడుతుంది. రెండు స్పూన్స్ శనగపిండిలో కాస్త నిమ్మరసం వేసుకుని ముఖం, మెడ భాగంలో సున్నితంగా రుద్దండి. ఓ పది నిమిషాలపాటు అలాగే ఉంచి ఆరిన తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్ చేయండి. ఇది కూడా తక్షణ ఫలితాలను ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter