Aloo Kadhi Recipe: బంగాళదుంప కూరను మనం సాధారణంగా కర్రీ, ఫ్రై లేదా పులుసు పెట్టి తయారు చేసుకుంటాం. అయితే, ఈసారి కాస్త డిఫరెంట్‌గా ఈ రిసిపీని ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు మళ్లీ మళ్లీ తయారు చేసుకుంటారు. ఈ కూర అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు..
బంగాలదుంపలు -2 మీడియం సైజు
పెరుగు -1 కప్పు
శనగపిండి- 2TBSP
నీళ్లు -2 కప్పులు
నెయ్యి లేదా నూనె -1TBSP
జిలకర్ర- 1TBSP
అల్లం-1TBSP (గ్రేట్ చేసింది)
పచ్చిమిర్చి-1TBSP
పసుపు-1TBSP
ధనియాల పొడి-1TBSP
కారంపొడి-1TBSP
కళ్లు ఉప్పు- 1TBSP
కరివేపాకు
ఇదీ చదవండి: ఇడ్లీ దోశలకు ఈ చట్నీ తయారు చేసుకోండి.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
తయారీ విధానం..
ముందుగా పెరుగు, శనగపిండి రెండిటినీ గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.ఒక ప్యాన్‌లో నెయ్యి వేసి కట్ చేసిన బంగాళదుంపలను కట్ చేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో జిలకర్ర వేసి చిటపటలాడాక అందులో అల్లం కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఓ నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి పెరుగు శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని కలపాలి. మిశ్రమం ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
ఇదీ చదవండి: రుచికరమైన సాబుదాన ఖిచిడీ ఇలా ఇన్స్టంట్ గా తయారు చేసుకోండి..
నీళ్లు పోసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసి ఓ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు శనగపిండి పూర్తిగా ఉడికిపోతుంది. కర్రీ స్మూత్ గా మారిప్పుడు అందులో వేయించిన బంగాళ దుంప ముక్కలు వేసి ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన బంగాళదుంప కూర రెడీ. దీన్ని అన్నం లేదా పూరీ, చపాతీల్లోకి తింటే బాగుంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter