Child Phone Addiction: ప్రస్తుత రోజుల్లో ఫోన్ అడిక్షన్ అనేది అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అలరి చేస్తున్నారని తల్లిదండ్రులు ఫోన్‌ను వారి చేతికి ఇస్తున్నారు. దీని కారణంగా వారు ఫోన్ అడిక్షన్ బారిన పడుతున్నారు.కొంతమంది తల్లిదండ్రులు అన్నం తిన్నాను అన్న, హోంవర్క్ చేయాడంలో ఫోన్‌తో ముడి వేస్తున్నారు. దీని కారణంగా పిల్లలు ఫోన్‌కు బానిసల మారుతున్నారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఫోన్ అడిక్షన్ కారణంగా పిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని పరిశోధనలో తేలింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
❂ పిల్లలను ఫోన్‌కు దూరంగా ఉంచడం: సాధారణంటగా పిల్లలు పెద్దలని చూసి వారు కూడా అదే పని చేస్తుంటారు. కాబట్టి ముందు తల్లిదండ్రలు పిల్లల కోసం మీ టైమ్‌ను కేటాయించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు వారితో ఉన్నప్పుడు కథలు చెప్పడం, ఆటలు ఆడుకోవడం వంటి పనులు చేయడం వల్ల ఫోన్ అడిక్షన్ నుంచి రక్షించుకోవచ్చు.
❂ శారీరక శ్రమ: నేటి కాలంలో చాలా మంది పిల్లలు ఆటలు ఆడుకోవడం అనేది అతి తక్కువగా చూస్తూ ఉంటాము. ఆడుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దీని వల్ల వారి మెదడు చురుకుగా ఉంటుంది. మీ పిల్లలను జాగింగ్ ,స్విమ్మింగ్, రన్నింగ్ లాంటివి అలవాటు చేయడం మంచిది.
Also read: Weight Loss: టమోటాతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
❂ బెడ్ రూమ్‌లో మొబైల్: చాలా మంది వారి బెడ్ రూమ్‌లో మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లను ఉంచుతారు. దీని వల్ల నిద్రపోకుండా వాటిని వినియోగిస్తు ఉంటారు. కాబట్టి మీ బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను పెట్టకుండా ఉంటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
❂ చదువడం కోసం: ప్రస్తుతం ఎలాంటి ప్రశ్నలకు అయిన ఒక క్లిక్‌తో సమాధనం దొరుకుతుంది. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఫోన్‌తో సమాధానం తెలుసుకుంటున్నాం. అయితే పిల్లలు చదువు కోసం ఫోన్‌ను వాడుతుంటారు. దీని వల్ల వారి ఆలోచన శక్తి తగ్గుతుంది. సొంతంగా సమాధానం చేయడం, ప్రశ్నను అర్థం చేసుకోవడం వంటిని తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దలు ఫోన్‌లో కాకుండా వారిని సొంతంగా సమాధానం తెలుసుకొనేలా చూడాలి.
ఈ టిప్స్‌ను పాటించడం వల్ల పిల్లలను ఫోన్ అడిక్షన్ నుంచి రక్షించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Deep Fried Foods: డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter