Women's Day 2023: మార్చ్ 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

International Women's Day 2023: ఈ ఏడాది కూడా మార్చి 8న అంటే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అనే వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 8, 2023, 12:07 PM IST
Women's Day 2023: మార్చ్ 8నే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

International Women's Day History: ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా మార్చి 8న అంటే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి భారత్‌ లో ఒకపక్క హోలీ రంగులతో హొలీ జరుపుకుంటూ ఉండగా భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? అసలు మహిళా దినోత్సవాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం ఎలా మొదలైంది? అనే వివరాల్లోకి వెళితే

మహిళా దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటారు?
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల విజయాలు, మహిళల హక్కుల పురోగతిని గుర్తు చేసుకుంటూ జరుపుకునే వార్షిక కార్యక్రమం. ఈ దినోత్సవం 20వ శతాబ్దంలో అమెరికన్ సోషలిస్టు, కార్మిక ఉద్యమాలతో ఉద్భవించింది. ఆ రోజుల్లో మహిళలు పని గంటలు తక్కువ ఉన్నాయని వాటి పెంచాలని, మంచి వేతనం ఇవ్వవలని, ఓటు హక్కు కల్పించాలని పోరాడుతున్నారు. అవి సాధించడం కోసం 1911లో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సమయంలో మహిళల హక్కులకు మద్దతుగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ సహా స్విట్జర్లాండ్‌లలో ర్యాలీలు కూడా చేశారు. ఈ క్రమంలో అనేక సంవత్సరాల తరువాత ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1977లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అప్పటి నుండి ఐక్యరాజ్యసమితి సభ్యులు ఈ రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు మొదలైంది?
ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా 1911లో మొదటి సారి ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1917 సంవత్సరంలో రష్యన్ మహిళలు నిరసనలకు దిగారు, వారు చేసిన నిరసన కారణంగా, అప్పటి రష్యన్ జార్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు వచ్చిన మధ్యంతర ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు కల్పించింది. రష్యన్ మహిళలు ఈ నిరసన ప్రారంభించిన రోజు రష్యన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 (ఆదివారం), అదే తేదీని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే, ఆ రోజు మార్చి 8వ తేదీ అన్నమాట. అలా రష్యన్ మహిళలు చేపట్టి విజయం సాధించడంతో అప్పటి నుండి ఈ రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు.

మహిళా దినోత్సవానికి మూడు రంగులు ఏంటో తెలుసా?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సూచించడానికి  మూడు రంగులు ఉన్నాయి. అవి తెలుపు, ఆకుపచ్చ అలాగే ఊదా రంగులు. మహిళా దినోత్సవ ప్రచారం ప్రకారం, తెలుపు స్వచ్ఛతను సూచిస్తుందని, ఆకుపచ్చ రంగు ఆశను సూచిస్తుందని, ఇక ఊదారంగు న్యాయం మరియు గౌరవాన్ని సూచిస్తుందని అంటున్నారు.

మహిళా దినోత్సవం ఎందుకు ఇంపార్టెంట్?
అయితే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మహిళలకు కూడా పురుషులతో సమాన హోదాను పొందడమే. ఏ రంగంలోనూ వివక్ష ఎదుర్కోకూడదు అని ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇక ఈ సందర్భంగా మహిళల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు, ప్రచారాన్ని కూడా నిర్వహిస్తారు. 

Also Read: Summer Skin Care: సమ్మర్‌లో చర్మ సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసా?

Also Read: Holi tips 2023: ముఖానికి అంటిన మరకలు వదిలించుకోవడం ఇంత ఈజీనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News