Moringa Oil For Hair: ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంది. వీటిని నుంచి బయటపడటం కోసం వివిధ రకాల ప్రొడెక్ట్స్‌లను, క్రీములను ఉపయోగిస్తారు. కానీ వీటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే సహాజంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు ఈ మునగ నూనెను ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మునగ నూనెను మునగ చెట్టు విత్తనాల నుంచి తీస్తారు. ఈ నూనెలో అద్భుతమైన పోషకాలకు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ, ఇ, సి, బి, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు పదార్థాలు అధికంగా లభిస్తాయి. ఈ నూనె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా జుట్టు సమస్యలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
మునగ నూనె కొన్ని ప్రయోజనాలు:
మునగాకు నూనె లోని పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌కు బలాన్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు, అంతేకాకుండా ఇది జుట్టు రాలడం తగ్గించడంలో మేలు చేస్తుంది. అలాగే మునగ నూనె స్కాల్ప్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు ఈ మునగ నూనెను ఉపయోగించడం వల్ల సమస్య నుంచి తర్వగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రును కలిగించే శిలీంధ్రాలను చంపడంలో సహాయపడతాయి. మునగ నూనె జుట్టుకు తేమను అందిస్తుంది, జుట్టును మెరిసేలా చేస్తుంది. మునగ నూనెలోని ప్రోటీన్లు జుట్టును బలంగా చేస్తాయి. మునగ నూనెలోని పోషకాలు జుట్టు కుదుళ్ళకు పోషణనిస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఈ నూనెను వారంలో ఉపయోగించడం వల్ల జుట్టును హైడ్రేట్ చేస్తుంది, దానిని బలంగా, మెరిసేలా చేస్తుంది. ఈ నూనెను వాడటం వల్ల దురద, చికాకును తగ్గిస్తుంది.
ఈ మునగ నూనెను జుట్టుకు ఎలా ఉపయోగించాలి:
ముందుగా స్కాల్ప్‌లో మునగ నూనెను వేసి 10-15 నిమిషాలు మసాజ్ చేయండి. ఆపై, షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి. జుట్టుకు మునగ నూనెను రాసి, 30 నిమిషాలు లేదా రాత్రంతా ఉంచండి. ఆపై, షాంపూతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత షాంపూ చేసిన తర్వాత మీ జుట్టుకు మునగ నూనెను కండీషనర్‌గా ఉపయోగించండి.
మునగ నూనె ఎక్కడ కొనుగోలు చేయాలి:
మునగ నూనె ఆరోగ్య ఆహార దుకాణాలు, ఆన్‌లైన్ రిటైలర్లలో లభిస్తుంది.
ముఖ్య గమనిక:
మునగ నూనెను ఉపయోగించే ముందు, మీరు చిన్న చర్మ ప్యాచ్‌పై పరీక్షించుకోవాలి. మీకు ఏవైనా అలెర్జీలు ఉంటే, మునగ నూనెను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి