Mosambi Benefits: బత్తాయి పండును చాలా మంది "మోసంబి"గా కూడా పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా బత్తాయి పండ్లను తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ పండ్లను తినడం వల్ల గుండె కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
బత్తాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వైరల్ ఫీవర్స్‌ను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
బత్తాయి పండులోని ఫైబర్ జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి కూడా ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మోసంబిలను అల్ఫాహారంగా తీసుకోండి.
గుండె ఆరోగ్యం కోసం..:
బత్తాయి పండులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు వీటితో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో ఫైబర్ కూడా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
చర్మ సమస్యలకు చెక్:
మోసంబిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు ముడతల చర్మాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే వృద్ధప్య సంకేతాలను తగ్గిస్తుంది. దీంతో పాటు చర్మంలోని కణాలను రిపేర్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
క్యాన్సర్‌తో పోరాడుతుంది:
బత్తాయి పండులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు క్యాన్సర్‌కు దారితీసే కణాలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి