Natural Treatment for Heart Palpitations: మానవ శరీరానికి గుండె ప్రధాన అవయవం. ప్రతి శరీర భాగానికి ఆక్సిజన్ తీసుకువెళ్లేందుకు గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు దాని స్పందనను బట్టి తెలుస్తుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో గుండె కొట్టుకోవడం హఠాత్తుగా పెరుగుతుంది. నిమిషానికి 120 కంటే వేగంగా హృదయ స్పందన పెరిగిపోతోంది. ఇలా కొట్టుకోవడం వల్ల పలు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నా యి.
అయితే గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉండే ఎక్కువగా కొట్టుకున్నప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
ఈ సమస్యను నివారించడం ఎలా..?:
ఎక్కువ నీరు తాగండి:
హెల్త్ లైన్ డాట్ కం సూచించిన వివరాల ప్రకారం సరైన మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతోపాటు మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉంటాయి. అందుకే నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాయామాలు చేయాలి:
వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా కూడా తయారవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామాల వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యమైన ఆహారం:
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి శరీరానికి వ్యాయామాలు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి:
హృదయ స్పందన రేటు పెరగడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజువారీ కార్యకలాపాల్లో ఒత్తిడికి గురవకుండా ఉంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామాలు కూడా సహాయపడతాయి.
Also Read: Mistakes in God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఈ తప్పులని మీరు గమనించారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook