Onion Juice For Hair Growth: చాలామంది ఒత్తిడి పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలడం సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలామందిలో వాతావరణం లోని కాలుష్యం పెరగడం కారణంగా కూడా తలపై దుమ్ముదులి పేరుకుపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం కారణంగా ముఖం కూడా అందహీనంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జుట్టు పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
జుట్టు రాలడం సమస్యతో బాధపడేవారు మార్కెట్లో లభించే ఖరీదైన రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. మరికొందరు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ను చేయించుకుంటున్నారు. వీటిని ఆశ్రయించడం వల్ల భవిష్యత్తులో శరీరంపై పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగిస్తే జుట్టు రాలిపోవడం ఆగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ నుంచి తీసిన రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు బట్ట తలపై కూడా సులభంగా జుట్టును తీసుకు రాగలరని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు దీనిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలతో సతమతమయ్యేవారు క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయాలి.
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల కుదుళ్ళ నుంచి జుట్టు బలంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు మొలవడానికి తలపై రక్త ప్రసరణను పెంచేందుకు కూడా సహాయపడుతుందని వారు అంటున్నారు. అయితే దీనిని వినియోగించే ముందు తప్పకుండా జుట్టును శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి