Premature White Hair Prevention: కొన్ని సంవత్సరాల క్రితం వృద్ధాప్యాంలో మాత్రమే తెల్ల జుట్టు సమస్యలు వచ్చేవి..కానీ ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వైట్ హెయిర్ సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా యువత తీవ్ర ఇబ్బందులు బారిన పడుతున్నారు. అయితే తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్, కలర్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రోడక్ట్స్‌ను వినియోగించే బదులుగా నేచురల్ పదార్థాలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు మొదలైతున్నవారు తప్పకుండా ఈ కింది నియమాలు పాటించాల్సి ఉంటుంది.
జుట్టు నెరవకుండా ఉండడానికి ఇలా చేయండి:
ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్లే తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జంక్, ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో సులభంగా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా కొంతమందిలో జుట్టు రాలడం సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండానికి విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్, జింక్, ఐరన్ కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
ధూమపానం మానుకోండి:
సిగరెట్ కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు రావడమేకాకుండా జుట్టు సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల తెల్ల జుట్టు రావడమే కాకుండా బట్టతల సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ధూమపానం మానుకోండి.
టెన్షన్‌ను తగ్గించుకోవడం చాలా మంచిది:
ఒత్తిడి కారణంగా రక్తపోటు సమస్యలే కాకుండా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఒత్తిడి కారణంగా ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఒత్తిడి నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్ బ్రాడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook