స్ప్రింగ్ రోల్ నూడుల్స్

-

Last Updated : Nov 5, 2017, 03:15 PM IST
స్ప్రింగ్ రోల్ నూడుల్స్

కావలసిన పదార్థాలు:-

నూడుల్స్ - ఒకటిన్నర కప్పు 

వెల్లుల్లి తరుగు - 1/2 టీస్పూన్ 

క్యారెట్ తురుము - 1 కప్పు 

క్యాబేజీ తురుము- 1 కప్పు 

ఉల్లికాడ తరుగు - 2 టీస్పూన్లు 

సోయాసాస్ - 2 టీస్పూన్లు 

స్ప్రింగ్ రోల్ షీట్స్  (షాపుల్లో దొరుకుతాయి) - 6

మిరియాల పొడి- పావు టీస్పూన్ 

కార్న్ పిండి- 1 టీస్పూన్ 

ఉప్పు- రుచికి తగినంత 

నూనె- తగినంత  

తయారీ విధానం:- 

* ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడిచేయాలి. వేడెక్కాక అందులో వెల్లుల్లి, ఉల్లికాడ వేసి కలపాలి. 

* కాస్త వేగాక సోయాసాస్, ఉప్పు,మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత నానబెట్టుకున్న నూడుల్స్ వేయాలి. 

* అందులోనే కార్న్ పిండి వేసి, కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ మంట కొద్దిగా పెంచుకోవాలి. 

* కొద్దిసేపయ్యాక ఆ నూడుల్స్ మిశ్రమాన్ని స్ప్రింగ్ రోల్ షీట్స్ లో పెట్టి ఫొటోలో కనిపిస్తున్నట్లు మడవాలి. 

* అలా మడచిన తరువాత వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్ లో తీసుకోవాలి. 

* వేడివేడిగా ఉన్నప్పుడే సాస్ తో సర్వ్ చేసుకోవాలి.

Trending News