Rid Dark Circles Under Eyes: ప్రస్తుతం మనలో చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలలో నైతే కంటి కింద నల్లటి వలయాల సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. చాలామందిలో కంటి కింద నల్లటి వలయాలు ఉండడం కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. అంతేకాకుండా కొంతమందిలో వలయాలు ముఖమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. క‌ళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో ఆధునిక జీవనశైలి కారణంగా వస్తే మరి కొంత మందిలో వంశపార్యంగా వస్తున్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆస్థమా అలర్జీ వంటి సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ నల్లటి వలయాలు వస్తాయట.

చాలామంది క‌ళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు మార్కెట్లో లభించే అనేక రకాల రసాయనాలతో కలిగిన ప్రొడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే అధ్యయనాల ప్రకారం.. ఈ సమస్యలు రావడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమందిలో నిద్ర లేకపోవడం, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వంటి అలవాట్ల కారణంగా కూడా వస్తున్నాయి. మరికొంతమందిలో మాత్రం విటమిన్ సి లోపం కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చని వారంటున్నారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు విటమిన్ ఎ, సి తో పాటు పోషకాలు అధిక మోతాదులో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రతిరోజు ఉదయం పూట క్యారెట్, బీట్రూట్, ఇతర దుంపలతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట బత్తాయి పండ్లతో తయారుచేసిన జ్యూస్ని తాగడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు విటమిన్ కె అధిక మోతాదులో ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కంటికింద నలుపు సులభంగా తగ్గుతుంది. దీంతోపాటు ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆల్కహాల్ కు దూరంగా ఉండడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా క‌ళ్ల కింద ఇలాంటి వలయాలు శాశ్వతంగా పోవడానికి పై చిట్కాలు పాటించడమే కాకుండా బరువు తగ్గడం కూడా చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

English Title: 
Rid Dark Circles Under Eyes: Carrot, Beetroot Foods Can Rid Dark Circles Under Eyes In 30 Days
News Source: 
Home Title: 

Dark Circles: ఏం చేసినా క‌ళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా? ప్రతిరోజు ఇలా చేయండి చాలు..
 

Dark Circles: ఏం చేసినా క‌ళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా? ప్రతిరోజు ఇలా చేయండి చాలు..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఏం చేసినా క‌ళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడం లేదా? ప్రతిరోజు ఇలా చేయండి చాలు..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, December 23, 2023 - 19:37
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
317

Trending News